service providers | Tapping | SIT

Service prividers agree the phone tapping of ap officials and ministers

service providers, Tapping, SIT, Vijayawada, Telangana, Chandrababu, Uninor, airtel, docomo

Service prividers agree the phone tapping of ap officials and ministers. SIT investigate the service providers in vijayawada. The service providers clear that they tapped the phones by saying higher officials of service providers.

ట్యాపింగ్ నిజమే.. ఇక సిట్ దూకుడే

Posted: 06/24/2015 07:53 AM IST
Service prividers agree the phone tapping of ap officials and ministers

తెలుగు రాష్ట్రాల్లో సెగ రేపుతున్న ట్యాపింగ్ వ్యవహారంలో ఏపి ప్రభుత్వానికి కీలక సమాచారం దొరికినట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ కు సంబందించిన వివరాలను రాబట్టేందుకు సర్వీస్ ప్రొవైడర్లకు ఇచ్చిన నోటీసులపై వారు సిట్ ముందు హాజరయ్యారు. అయితే ట్యాపింగ్ కు పాల్పడినట్లు సిట్ కు దాదాపు క్లారిటీ వచ్చిందని సమాచారం. రెండు రోజులుగా సాగిన సర్వీస్ ప్రొవైడర్ల దర్యాప్తులో ట్యాపింగ్ కు సంబందించిన ఆధారాలు కూడా లభించినట్లు భావిస్తున్నారు. అయితే మొత్తం 149 ఫోన్ నెంబర్లపై సిట్ అధికారులు ఎక్కువగా దృష్టి సారించారని, ఇందులో కొన్ని నెంబర్లు ట్యాపింగ్ కు గురైనట్లు గుర్తించింది సిట్. అయితే తమ కంపెనీకి చెందిన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగినట్లు సర్వీస్ ప్రొవైడర్లు సిట్ ముందు వెల్లడించినట్లు తెలుస్తోంది. ట్యాప్‌ జరిగిన ఫోన్లకు సంబంధించిన రికార్డులు, సీడీలను సిట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న రికార్డుల్లో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి, నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ మధ్య జరిగిన సంభాషణల టేపులు కూడా ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ కు చెందిన 14 మంది ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు ఆధారాలతో సహా గుర్తించినట్లు తెలుస్తోంది. ట్యాపింగ్‌కు సంబంధించి రెండు నెలల రికార్డులన్నీ సీడీల రూపంలో ఇవ్వాలని సిట్‌ ఆదేశించింది. ఇందుకు సర్వీస్‌ ప్రొవైడర్లు అంగీకరించారని తెలిసింది. కాగా డాటా ఇవ్వడానికి తమకు కొంత టైం కావాలని కోరినట్లు సమాచారం. రెండు రోజుల విచారణలో ఆయా కంపెనీల ప్రతినిధులు చెప్పిన వివరాల ఆధారంగా సిట్ విచారణ వేగవంతం చెయ్యనుంది. అయితే తమ కంపెనీ ఉన్నతాధికారులు చెప్పినందుకే ట్యాపింగ్ చేశామని సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చిన సమాచారం మేరకు ఆ ఉన్నతాధికారులను కూడా విచారించాలని సిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : service providers  Tapping  SIT  Vijayawada  Telangana  Chandrababu  Uninor  airtel  docomo  

Other Articles