Chandrababu naidu | Talasani | Hyderabad

Telangana minister talasani srinivas yadav said that ap cm chandrababu naidu plans to riots in hyderabad

Chandrababu naidu, section8, cash for vote, tapping, hyderabad, riots, Talasani

Telangana Minister talasani Srinivas Yadav said that ap cm chandrababu naidu plans to Riots in hyderabad. Talasani attacked on chandrababu naidu.

హైదరాబాద్ లో అల్లర్లకు చంద్రబాబు ప్లాన్

Posted: 06/24/2015 07:48 AM IST
Telangana minister talasani srinivas yadav said that ap cm chandrababu naidu plans to riots in hyderabad

ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారని తెలంగాణమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆరోపించారు. ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేశాలు రెచ్చగొట్టి హైదరాబాద్‌లో రాష్ట్ర పునర్‌విభజన చట్టంలోని సెక్షన్‌ 8ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రేవంత్‌రెడ్డి ముడుపుల వ్యవహారంలో కేసు తన మెడకు చుట్టుకుంటుందని బాబు ఊహించలేదన్నారు. తీరా ఈ కేసు ఆయన మెడకు చుట్టుకోవడంతో దాన్ని నుండి తప్పించుకోవడానికి సెక్షన్‌ 8 అమలు కోసం పట్టు పడుతున్నారని మంత్రి విమర్శించారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పదవి రావడం కాదు.. బుద్ధి, జ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. మెడకు చుట్టుకున్న కేసు నుండి ఏదోవిధంగా బయట పడేందుకు చంద్రబాబు విద్వేశాలు రెచ్చగొడుతూ కొత్త సమస్యలకు ఆజ్యం పోస్తున్నారని విమర్శించారు.

హైదరాబాద్‌ లో శాంతిభద్రతల సమస్య ఎక్కడా లేదని , సెక్షన్‌ 8 అమలు చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగిన ఏడాది కాలంలో హైదరాబాద్‌లో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోలేదన్నారు. ఓటుకు నోటు కేసు తరువాతనే తెలంగాణలో ఆధ్రప్రదేశ్‌ ప్రజలకు రక్షణ లేకుండా పోయిందా అని ఆయన ప్రశ్నించారు. ఈ చిల్లర రాజకీయాలు మానుకోవాలని తెలిపారు. హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాల ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని, ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకు ఇబ్బందులున్నట్లు ఎక్కడా ఫిర్యాదు లేవని, ఈ తరుణంలో సెక్షన్‌ 8 అమలు జరపాల్సిన అవసరం లేదన్నారు. తమ ప్రభుత్వం సెక్షన్‌ 8కు లోబడే నడుచుకుంటుందని తెలిపారు. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వాల్సి వస్తే మెడలు వంచైనా నోటీసులు ఇచ్చేందుకు వెనకాడమన్నారు. చట్టం ముందు అధికారం పని చేయదన్నారు. ఆంధ్ర ప్రజలను గాలికొదిలేసి, ఇక్కడ ఎపి ప్రభుత్వ పెద్దలు రాజభోగాలు అనుభవిస్తున్నారని , ఎపి మంత్రులు, ఎమ్మెల్యేల్లో 70శాతం మంది హైదరాబాద్‌ లోనే ఉంటున్నారని ఆయన ఆరోపించారు. వారందరికీ తెలంగాణ ప్రభుత్వమే భద్రత కల్పిస్తుందన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu naidu  section8  cash for vote  tapping  hyderabad  riots  Talasani  

Other Articles