Section8 | Hyderabad | Telangana | Ap

Telangana state and andhrapradesh fight on implementation of section 8 in hyderabad

Section8, Hyderabad, Telangana, Ap, Common capital, KCR, central govt

Telangana state and andhrapradesh fight on implementation of section 8 in hyderabad. Central govt moves to implement the section 8 in the common capital of ap, telangana.

ఇక హైదరాబాద్ పైనే రెండు రాష్ట్రాల సెక్షన్ వార్..

Posted: 06/24/2015 08:22 AM IST
Telangana state and andhrapradesh fight on implementation of section 8 in hyderabad

ఏఫి, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సెక్షన్ 8 చిచ్చు రగులుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు, శాంతి భద్రతలు, గవర్నర్‌కు అప్పగించే సెక్షన్ 8 అమలు విషయంలో అభిప్రాయబేధాలు తారాస్ధాయికి చేరడంతో వాతావరణం వేడెక్కింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ చట్టంలోని సెక్షన్ 8లో పొందుపర్చిన అధికారాలను ఉమ్మడి గవర్నర్ చేతికి ఇవ్వాలన్న కేంద్రం యోచనను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తీవ్రంగా పరిగణించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం ప్రతిపాదనపై సంతోషం వ్యక్తం చేస్తోంది.మరో తెలంగాణ ఉద్యమానికి సమాయత్తం అవుతామని తెలంగాణ ఉద్యోగ, కార్మిక సంఘాలు ప్రకటించాయి. కేంద్రం సెక్షన్ 8ను అమలు చేసే ప్రతిపాదనను పరిశీలించడమే కాకుండా చిత్తశుద్ధితో అమలు చేయాలని ఏపీ మంత్రులు డిమాండ్ చేశారు. ఈ పరిణామాల మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కలుసుకుని చర్చించడం  ప్రాధాన్యత సంతరించుకుంది. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ శాంతి భద్రతలను గవర్నర్‌కు అప్పగించే ప్రతిపాదనను ఆమోదించే ప్రసక్తిలేదని, దీనిపై ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని కెసిఆర్ గవర్నర్‌కు తెగేసి చెప్పినట్టు సమాచారం. శాంతి భద్రతలు, పోలీసుల వ్యవహారాలపై రాష్ట్రాలకు సంపూర్ణ అధికారం ఉంటుందని, సమాఖ్య తరహా వ్యవస్థలో ఉన్నామని, ఈ అంశాన్ని తమ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని ఆయన గవర్నర్‌కు నివేదించినట్టు తెలిసింది. అవసరమైతే తాను ఇక్కడగానీ, ఢిల్లీలోగానీ నిరవధిక దీక్షకు వెనుకాడనని, రాష్ట్రాల హక్కులను కేంద్రం హరించే విషయంలో జాతీయస్థాయిలో ఎన్డీయేతర ప్రభుత్వాలు, పార్టీల మద్దతు కూడా తీసుకుంటామని కెసిఆర్ సూత్రప్రాయంగా తెలిపినట్టు తెలిసింది.

గవర్నర్‌ రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తి. సెక్షన్‌ 8 అమలుకు సంబంధించి సందేహాలు వస్తే న్యాయ నిపుణుల సలహా తీసుకుని తనంతట తాను చర్యలు తీసుకోవచ్చు.అని అటార్ని జనరల్ తెలిపారు. చట్టం ప్రకారం ఈ దేశ అత్యున్నత న్యాయ నిపుణుడు అటార్నీ జనరల్ కాబట్టి గవర్నర్‌కు ప్రత్యేక, విశేష అధికారాలు ఉంటాయని ఆయనే తేల్చి చెప్పానపుడు ఇక అడ్డు ఏంటని ఏపి అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక సెక్షన్‌ -8కు లైన్‌ క్లియర్‌ అయినట్లేనని ఏపీ సర్కారు భావిస్తోంది. ఎవరేమనుకుంటున్నారన్నది ముఖ్యం కాదు. చట్టంలో ఏముందన్నదే కీలకమని.. ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలపై గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలున్నాయని సెక్షన్‌ 8 చెబుతోందని ఏపి సర్కార్ వాదిస్తోంది. గవర్నర్‌ తెలంగాణ కేబినెట్‌ను సంప్రదించినప్పటికీ, ఆయన సొంత విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవచ్చునని, దీనిని ఎవరూ ప్రశ్నించలేరని స్పష్టంగా ఉందని అంటున్నారు. ఈ సెక్షన్‌ చెల్లదంటే, రాష్ట్ర విభజన చట్టం కూడా చెల్లదు’’ అని గట్టిగా వాదిస్తున్నారు. అటార్నీ జనరల్‌ అభిప్రాయం మేరకు గవర్నర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి కేంద్రం సెక్షన్ 8 అమలుకు సిద్దపడుతుందా..? ఒకవేళ హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలుకు సిద్దపడితే కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేస్తారా.? అన్న ప్రశ్నలకు సమాధాలు కాలమే చెబుతుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Section8  Hyderabad  Telangana  Ap  Common capital  KCR  central govt  

Other Articles