palle raghunatha reddy dares Telangana government to issues notices to chandra babu

Palle raghunatha reddy takes on chandra shekar rao

palle raghunatha reddy takes on chandra shekar rao, cash for vote scam forth accused muthaiah, muthaiah jerusalem, vijayawada police, satyanarayana puram police, andhra pradesh crime investigation department, cash for vote, chandra babu, revanth reddy, acb, note for vote, bribery case, horse riding, Kcr, telangana mlc elections, revanth reddy bail, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, acb, sunita reddy, geeta reddy, jaipal reddy, jana reddy, horse riding

andhra pradesh minister palle raghunatha reddy dares Telangana government to issues notices to chandra babu in cash for vote row

కేసీఆర్ కు సవాల్ విసురుతున్న ఏపీ మంత్రులు..

Posted: 06/20/2015 08:46 PM IST
Palle raghunatha reddy takes on chandra shekar rao

దమ్ముంటే తమ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి బహిరంగంగా సవాల్ విసిరారు. శనివారం అనంతపురంలో పల్లె రఘునాథరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ... రేవంత్రెడ్డి కేసు నుంచి బయటపడేందుకు కేంద్రప్రభుత్వంతో లాలూచీ పడ్డామని ప్రచారం చేయడం సరికాదన్నారు. రేవంత్రెడ్డి కేసు ఎలక్షన్ కమిషన్ పరిధిలోనిది అని అన్నారు. అయితే ఆ వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేస్తే ఎలా అంటూ విలేకర్ల ఎదుట తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి కేసును ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

రేవంత్ వ్యవహారంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేసిన ఛానెళ్లు, కథనాలు అందించిన పత్రికలకు మాత్రమే నోటీసులు జారీ చేశామన్నారు. చంద్రబాబుపై అసత్య ప్రచారాలు చేసినందుకే టీ న్యూస్ ఛానెల్కు నోటీసులు జారీ చేశామని చెప్పారు. అయితే ఈ విషయంలో జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేయడం సరికాదన్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చే దమ్ము లేదా అంటూ పల్లె రఘునాథరెడ్డి ఈ సందర్భంగా టీ న్యూస్ చానెల్ను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఓ టీవీ ఛానెల్ ప్రసారాలపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని... ఓ విలేకరి అడిగి ప్రశ్నకు సమాధానంగా పల్లె రఘునాథరెడ్డి చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Palle Raghunatha Reddy  AP IT Minister  KCR  chandrababu naidu  

Other Articles