ప్రతిరోజూ చాక్లెట్లు తినడం మంచిదా, కాదా? అన్న అనుమానం ప్రతీ ఒక్కరిలో కలుగుతోంది. ముఖ్యంగా పిల్లలను మాత్రం వారి తల్లిదండ్రులు చాక్కెట్లకు దూరంగా వుంచుతుంటారు. దీనికి కారణం.. ప్రతిరోజూ చాక్లెట్లు తింటే వంటికి మంచిది కాదని, దంతాలు పాడు కావడం మాత్రమే గాక ఇతర ఆరోగ్య సంబంధమైన సమస్యలు వస్తాయని వారు భావించడమే. అయితే ఇలాంటి భావనలకు ఇక చెక్ చెప్పండి. ఎందుకంటారా..? రోజుకో చాక్లెట్ తినండి, హృద్రోగాలకు దూరంగా ఉండండి అని తాజాగా పరిశోధకులు చెబుతున్నారు.
ఈ విషయాన్నే హార్ట్ అనే మెడికల్ సైన్స్ జర్నల్లో పరిశోధకులు వెల్లడించారు. వారు దాదాపు 20వేల మందిని ఎంపిక చేసి వారితో పరిశోధనా పద్ధతి ప్రకారం చాక్లెట్లు తినిపించి ఫలితాన్ని విశ్లేషించారు. చాక్లెట్లు తిన్నవారికంటె చాక్లెట్లు తిననివారిలోనే హృద్రోగ సంబంధమైన వ్యాధికి అవకాశాలు ఎక్కువ అని తేలింది. చాక్లెట్లో కోకో పదార్థంతో పాటు పాలు, చక్కెర ఉంటాయి. చక్కెర గురించి, పాల గురించీ అందరికీ తెలిసిందే.
ఈ రెండూ తీసేస్తే మిగిలింది కోకో. ఇందులో ఉండే పాలిఫినోల్స్ మనిషికి గుండె పోటు రాకుండా కాపాడుతున్నట్టు భావించాలని పరిశోధకులు చెబుతున్నారు. అంటే ఈ పాలిఫినోల్స్ మనిషి రక్త నాళాలు మరింత ఆరోగ్యంగా ఉండేటట్టు పనిచేస్తున్నాయని భావించాలని పరిశోధకులు తేల్చారు. వంద గ్రాముల బరువు ఉన్న చాక్లెట్లు తింటే పెద్ద సమస్యేమీ ఉండకపోవచ్చునని అంటున్నారు. అయితే అమితంగా తీసుకుంటే ఔషదం కూడా విషంగానే మారుతుందన్న పెద్దలు చెప్పిన మాటను మాత్రం మరువరాదు సుమండీ..!
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more