Mangoes | Murder | Karimnagar | Malhar mandal.

Man murdered for stealing mangoes in malhar mandal of karimnagar dist

Mangoes, Murder, Karimnagar, Malhar mandal.

Man murdered for stealing mangoes in Malhar mandal of Karimnagar dist. In a gruesome incident a man was beaten to death on Wednesday night for allegedly stealing mangoes and for not paying the fine imposed on him for that. The mangoes were stolen from a farm in Peddatndla village in Malhar mandal. The family of the victim staged a dharna in front of the house of the killer seeking compensation.

మామిడిపళ్ల కోసం మర్డర్

Posted: 06/19/2015 11:10 AM IST
Man murdered for stealing mangoes in malhar mandal of karimnagar dist

మీరు చదివిన టైటిల్ అక్షరాల నిజం. మామిడి పళ్ల కోసమే ఓ మర్డర్ జరిగింది. అది కూడా ఎక్కడో కాదు కరీంనగర్ జిల్లాలో. ఇప్పటి వరకు డబ్బుల కోసమో, ఆస్తుల కోసమో మర్డర్ లు జరిగిన ఘటనలు చాలానే చూశాం. కానీ తాజాగా మామిడిపళ్ల కోసం జరిగిన మర్డర్ అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఓ తోటలో ఉన్న మామిడి పళ్లను దొంగిచిన వ్యక్తిని తోట యజమాని పట్టుకున్నాడు. దాంతో సరేఅనుకొని మామిడి పళ్ల రేట్ కట్టివ్వడానికి ఒప్పుకున్నాడు. కానీ పాపం ఎందుకో ఇవ్వలేదు. అంతే మామిమడి సళ్ల దొంగతనం చేసి డబ్బులు ఇస్తానని ఇవ్వవా అంటూ ఏకంగా దొంగను మర్డర్ చేశాడు తోట యజమాని. కరీంనగర్ జిల్లాలో జరిగిన ఈ దారుణం ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. అసలే మామిడిపళ్ల మర్డర్ మ్యాటర్ తెలియాలంటే మొత్తం స్టోరీ చదవాల్సిందే..

కరీంనగర్ జిల్లా మల్హారావ్ మండలం పెద్దతూండ్ల గ్రామానికి చెందిన రవి తన మామిడి తోటలో కాసిన మామిడి కాయలకు కాపుగా ఉంటున్నాడు. అయితే అదే గ్రామం పక్కన ఉన్న లంబడి తాండకు చెందిన నక్క రమేష్ రవి తోటలోని మామిడి పళ్లను దొంగతనం చేశాడు. అయితే రమేష్ మామిడి పళ్లను దొంగతనం చేస్తుండగా రమేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. దాంతో బాబూ తప్పైంది మామిడి పళ్లకు ఎంతవుతుందో చెప్పు కట్టేస్తా అని అనడంతో రవి వెయ్య రూపాయలు కట్టాని అన్నాడు. కానీ రమేష్ ఎంతకీ వెయ్య రూపయాలు కట్టకపోవడంతో ఏకంగా అతన్ని చంపాలని రవి డిపైడ్ అయ్యాడు. ఇంకేముంది అనుకున్నదే తడువుగా మర్డర్ చేశాడు. చనిపోయిన రమేష్ కు ఇద్దరు పిల్లలు అది కూడా ఐదేళ్లలోపే ఉన్నారు. అయినా మామిడి పళ్ల కోసం మర్డర్ చెయ్యడమేంటో అని అందరూ మాట్లాడుకుంటున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mangoes  Murder  Karimnagar  Malhar mandal.  

Other Articles