Prime Minister Narendra Modi Wishes Rahul Gandhi on His Birthday | Indian Politics

Pm narendra modi wishes rahul gandhi on his birthday

narendra modi, rahul gandhi, rahul gandhi birthday, narendra modi updates, narendra modi twitter, twitter controversy, modi twitter controversy, modi controversy, narendra modi controversy, narendra modi tweets

PM Narendra Modi Wishes Rahul Gandhi on His Birthday : Prime Minister Narendra Modi has extended birthday greetings to Congress Vice President Rahul Gandhi, who turned 45 today.

రాహుల్ గాంధీకి ‘విషెస్’ తెలిపిన ప్రధాని మోదీ

Posted: 06/19/2015 11:24 AM IST
Pm narendra modi wishes rahul gandhi on his birthday

‘అదేంటి.. ప్రత్యర్థి పార్టీ నాయకుడైన రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ విషెస్ చేయడమేంటి? నిజానికి వీరిద్దరి మధ్య నిత్యం మాటలతూటాలు పేలుతుంటాయి కదా! అలాంటప్పుడు ఈ ‘విషెష్’ వ్యవహారం ఏంటి?’ అని ఆలోచిస్తున్నారా! అదేం లేదండి.. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడైన రాహుల్ గాంధీ నేడు 45వ పడిలోకి అడుగుపెట్టారు. అంటే.. ఈరోజు ఆయన జన్మదినం కాబట్టి.. ఈ సందర్భంగా మోడీ శుభాకాంక్షలు తెలిపారు.

‘కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను’ అని మోదీ ట్విటర్ వేదిక ద్వారా ఆకాంక్షించారు. మోదీతోపాటు మరికొందరు రాజకీయ నాయకులు రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. ఇక రాహుల్ తోపాటు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మణిపూర్ ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబి సింగ్ కు కూడా ట్విటర్ లో మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలావుండగా.. చాలా ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీ తన పుట్టినరోజును జరుపుకుంటుండటంతో ఢిల్లీలో వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు.

modi-wishesh-rahul-gandhi

రాహుల్ కి ప్రధాని మోదీ శుభాకాంక్షలైతే తెలిపారు కానీ.. ఢిల్లీలో నిర్వహిస్తున్న వేడుకలపై ఏ విధమైన సెటైర్లు వేస్తారోనని చర్చించుకుంటున్నారు. అటు రాహుల్ కూడా తన బర్త్ డే వేడుకనాడు ఏ విధమైన స్టేట్ మెంట్లు ఇస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ రాహుల్ జన్మదినం సంతోషకరంగా సాగుతుందా.. లేదా వివాదాలకు కేంద్రబిందువుగా మారుతుందా..? వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  rahul gandhi  birthday wishesh  twitter  

Other Articles