water | ap | hyderabad | seemandhra | telangana

Seemandra people in hyderabad will get water from ap share

water, ap, hyderabad, seemandhra, telangana

Seemandra people in hyderabad will get water from ap share. Telangana govt propose to alloted hyderabad water to seemandra, will be collected from ap.

హైదరాబాద్ లోని సీమాంధ్రులకు ఏపి నీళ్లంట..!

Posted: 06/19/2015 08:19 AM IST
Seemandra people in hyderabad will get water from ap share

నీళ్లు, నిధులు అంటూ తెలుగు రాష్ట్రాల మధ్య సాగిన ఉద్యమం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ముగిసింది. అయితే హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేస్తూ పది సంవత్సరాలు కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే హైదరాబాద్ లో ఉంటున్న సీమాంధ్రులకు ఏపి నీళ్లివ్వాలని నిర్ణయానికి వచ్చారు. అదేంటి హైదరాబాద్ లో ఏపి నీళ్లు, తెలంగాణ నీళ్లు అని వేరు వేరుగా వస్తాయని అనుకుంటున్నారేమో కానీ అసలు మ్యాటర్ అది కాదు. రెండు రాష్ట్రాల మధ్య సాగుతున్న నీటి కేటాయింపుల్లో భాగంగా తాజాగా హైదరాబాద్ లో ఉంటున్న సీమాంధ్రులకు ఏపి నీళ్లు అనే ప్రతిపాదన వచ్చింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సీమాంధ్రకు చెందిన ప్రజలు చాలా మంది ఉంటున్నారు కాబట్టి ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏ రాష్ట్రానికి చెందిన ప్రజల విషయాలు ఆ రాష్ట్రం పట్టించుకోవాలన్నట్లుగా తాజాగా నీటి పంపకం సాగుతోంది.

తాజాగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఉంటున్న సీమాంధ్రులకు కేటాయించే నీళ్లు ఏపి వాటా కింద ఇవ్వాలని ప్రతిపాదన వచ్చింది. కృష్ణాయాజమాన్య బోర్డ్ మీటింగ్ లో భాగంగా జరిగిన ఒప్పందంలో భాగంగా ఈ నిర్ణయానికి వచ్చారు.  కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్‌, ప్రకాశం బ్యారేజీలకు నీటి కేటాయింపులు, విడుదల, పరిధి, కొత్త ప్రాజెక్టులపై జరిగిన చర్చలో సీమాంధ్రులకు ఏపి వాటా కింద నీళ్లు అనే ప్రతిపాదన వచ్చింది.  హైదరాబాద్‌ నగరానికి భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా 17-20 టీఎంసీల నీరు అవసరమవుతుందని.. నగరంలో ఆంధ్రా ప్రాంత ప్రజలు ఎక్కువగా ఉన్నారని, కాబట్టి ఈ మొత్తంలో సగం నీటిని ఏపీ వాటా నుంచి తీసుకుంటామని తెలంగాణ అధికారులు వాదించినట్లు తెలిసింది స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే, ఏపీలో కరువు జిల్లాలు ఉన్నాయని, వాటికి నీటిని ఇవ్వాల్సి వస్తుందని ఏపీ అధికారులు చెప్పారు. అలాగే భవిష్యత్‌లో తమకు కూడా రాజధాని నగరం నిర్మితమవుతుందని, దాని అవసరాలకూ నీరు కావాలని వాదించినట్లు తెలిసింది. చివరకు, హైదరాబాద్‌కు అవసరమయ్యే నీటిని ఆంధ్రా, తెలంగాణలు చెరి సగం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తానికి సీమాంధ్రులకు ఏపి నీళ్లు రానున్నాయి అనే వార్త కాస్త ఇంట్రస్టింగ్ గా మారింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : water  ap  hyderabad  seemandhra  telangana  

Other Articles