section8 | hyderabad | ap | telangana | governor

Central govt like to move on implementation of section8 in hyderabad

section8, hyderabad, ap, telangana, governor, chandrababu, kcr

Central govt like to move on implementation of section8 in hyderabad. Ap cm chandrababu naidu pressured on central govt to implement sction 8 in hyderabad.

హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలుకు కేంద్రం అడుగులు

Posted: 06/19/2015 07:48 AM IST
Central govt like to move on implementation of section8 in hyderabad

తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్నవివాదాలు తారా స్థాయికి చేరిన విషయం అందరికి తెలుసు. తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు ఏపి ప్రభుత్వం వాదిస్తోంది. అయితే ట్యాపింగ్ వివాదం కాస్తా చిలికి చిలికి సెక్షన్-8 మీదకు మళ్లింది.  హైదరాబాద్ లో తమకు రక్షణ కరువైందని తమ రక్షణ కోసం హైదరాబాద్ లో గవర్నర్ కు అధికారాలు కల్పించే సెక్షన్ 8ను అమలు చెయ్యాలని ఏపి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో సెక్షన్ 8ను అమలు చెయ్యాలని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ లను కలిసి వివరించారు. అయితే ఏపి ప్రభుత్వం చేస్తున్న వత్తిడికి కేంద్రం తలొగ్గిన్నట్లే కనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్ లో సెక్షన్-8 అమలుకు కేంద్రం గ్రౌండ్ వర్క్ చేస్తోంది. ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలు,చట్టపరమైన కీలక చర్యలపై నన్ను సంప్రదించకుండా ఎలాంటి నిర్ణయాలూ తీసుకోవద్దని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల డీజీపీలను ఆదేశిస్తూగవర్నర్‌ నోటిఫికేషన్‌ సిద్ధం చేసినట్లు తెలిసింది దీనిని కేంద్ర ప్రభుత్వ తుది అనుమతి కోసం పంపించినట్లు సమాచారం. ఈ నోటిఫికేషన్‌ ప్రతిని కేంద్ర ప్రభుత్వం అటార్నీ జనరల్‌ పరిశీలనకు పంపినట్లు సమాచారం.

తెలంగాణ సర్కార్ మాత్రం సెక్షన్-8 అమలుపై మండిపడుతోంది. ఏపి ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై గవర్నర్ ను కలిసిన కేసీఆర్ ఇప్పటికే సెక్ష్ఃన్ 8 అమలును అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు ఎలాంటి అధికారాలు కట్టబెట్టినా తాము కోర్టుకు వెళ్లడం, న్యాయపోరాటం చేయడం ఖాయమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, గవర్నర్‌కు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది. తదుపరి పరిణామాలు, రాజకీయ పరిస్థితులు, ఒత్తిళ్లు, ఇరు రాష్ట్రాల్లో ప్రభావం... వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశముందని చెబుతున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : section8  hyderabad  ap  telangana  governor  chandrababu  kcrsection8  hyderabad  ap  telangana  governor  chandrababu  kcr  

Other Articles