Venkiah naidu | Central govt | KTR | Telangana | ap | Chandrababu | KCR | Tapping

Central minister gave strong warning to telangana and andhrapradesh

Venkiah naidu, Central govt, KTR, Telangana, ap, Chandrababu, KCR, Tapping

Central minister gave strong warning to telangana and andhrapradesh. central minister Venkayya naidu sent a message by KTR.

వెనక్కి తగ్గండి అంటూ కేంద్రం హుకుం

Posted: 06/19/2015 08:43 AM IST
Central minister gave strong warning to telangana and andhrapradesh

తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు ముదురుతున్నాయి. టేపులతొ మొదలైన వివాదం ట్యాపింగ్ వరకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దూకుడుకు ఫి ప్రభుత్వం సవాల్ తో పరిస్థితి వేడిగా మారింది. అయితే రెండు రాష్ట్రాల విభేదాల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని కేంద్రం బావిస్తోంది. తాజాగా తెలుగు రాష్ట్రాలను తగ్గమని కేంద్ర ప్రభుత్వం సలహా ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది. తెలంగాణ సర్కార్ వెనక్కి తగ్గాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తనను కలిసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ ద్వారా కేసీఆర్ కు సమాచారం పంపినట్లు తెలుస్తోంది. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న వత్తిడికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సర్కార్ కు హుకుం జారీ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. నిన్నటి దాకా రెండు రాష్ట్రాల వాదనలు విన్న కేంద్రం ఇక వ్యవహారం చాలా దూరం వెళుతోందని అందుకే జోక్యం చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటిదాకా జరిగింది చాలు! ఇంతకు మించి వద్దు! ఇంకా... రచ్చకెక్కవద్దు అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇద్దరు సీఎంలకు స్పష్టం చేశారు. గోరంతను కొండంతలు చేసుకోవద్దని హితవు పలికినట్లు తెలుస్తోంది.  అంతేకాదు, ఇంతకు మించి ముందుకు వెళితే మీకే ఇబ్బంది వచ్చే ప్రమాదముందని తెలంగాణ సర్కారుకు పరోక్ష సంకేతాలు కూడా పంపించారు. కేంద్ర మంత్రి సూచనలను పాటించినట్లయితే... టేపులు, ట్యాపుల వివాదం మొత్తం కొదిరోజుల్లోనే చప్పున చల్లారిపోయే అవకాశముంది. ఆయన మాట వింటారా లేదా, ఈ వివాదం ఇంతటితో ఆగిపోతుందా, లేదా అనే విషయం పక్కనపెడితే... ప్రస్తుతానికైతే టెలిఫోన్‌ ట్యాపింగ్‌పై తమకు లభించిన ఆధారాలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. తమ ప్రభుత్వ పెద్దలు, ఇతర ప్రముఖుల ఫోన్లను తెలంగాణ సర్కారు ట్యాప్‌ చేసిందంటూ కేంద్రానికి ఏపీ అధికారులు కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ట్యాపింగ్‌పై అంతర్గత విచారణ చేసి నివేదిక రూపొందించాలని కేంద్రం భావిస్తోంది. ట్యాపింగ్‌ తీవ్రమైన నేరమని, కేసీఆర్‌ ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందని అని కేంద్రం అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. మరి కేంద్రం హెచ్చరికలతో తెలంగాణ సర్కార్ వెనక్కి తగ్గుతుందో లేదో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkiah naidu  Central govt  KTR  Telangana  ap  Chandrababu  KCR  Tapping  

Other Articles