Traffic jam | china | Beijing | ten days in traffic

Ten days traffic jam placed in beijing china

Traffic jam, china, Beijing, Traffic, ten days in traffic

Ten days traffic jam placed in beijing china. IN most population country china facing traffic jam problem. Recently in Beijing hundred kilometers traffic jam on roads.

ఏకంగా పది రోజులపాటు ట్రాఫిక్ జామ్

Posted: 06/18/2015 03:58 PM IST
Ten days traffic jam placed in beijing china

అర్జంట్ గా ఎక్కడికో వెళ్లాల్సి వస్తుంది. కంగారు కంగారుగా బయటకు వస్తే రోడ్డు మీద విపరీతమైన ట్రాఫిక్. అటు ముందుకు వెళ్లలేక.. ఇటు వెనక్కి వెళ్లలేక నరకం కనిపిస్తుంది. మెట్రో సిటీలల్ో మామూలుగా కనిపించే, రోజూ ఎదురయ్యే పరిస్థితి ఇది. అయితే ఇప్పటివరకు మీరు ట్రాఫిక్ జామ్ లో గంట లేదా రెండు గంటలు మహా అయితే 10గంటలు చిక్కుకుపోయి ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా రోజుల తరబడి ఈ జంజాటంలో ఇరుక్కుపోయారా? అంటే వారం, 10 రోజులు అన్నమాట. ఏంటి 10 రోజుల పాటు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోవడమా, ఇంకేమన్నా ఉందా అని చిరాకు పడకండి.కానీ ఇది నిజంగా జరిగింది. ట్రాఫిక్ జామ్ లో చిక్కుకొని.. ఒకటి కాదు రెండు కాదు వంద కిలోమీటర్లపైగా ట్రాఫిక్ జామ్ అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి.

ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశం చైనాలోని బీజింగ్ లో స్థానికులు ఆ నరకయాతన అనుభవించారు. కావాలంటే ఈ ఫొటోను చూడండి. ఎన్ని వేల వాహనాలు ఎలా నిలిచిపోయాయో మీకే తెలుస్తుంది. గంటో రెండు గంటలో కాదు, పూటో రెండు పూటలో కాదు ఏకంగా పదిరోజుల పాటు ఈ జామ్ కొనసాగింది. ఏకంగా 100 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ ట్రాఫిక్ జామ్ బీజింగ్ – టిబెట్ ఎక్స్ ప్రెస్ వే పై కనిపించింది. రోడ్డు విస్తరణ పనులే ఇందుకు కారణం. ఈ ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి అధికారులకు 10 రోజులు పట్టిందట. ఆ పది రోజులు వాహనదారులు ఎవరికి నచ్చినట్టు వారు కాలక్షేపం చేశారు. కొందరు ఇంటి నుంచి నీళ్లు, ఆహారం తెప్పించుకుంటే.. డబ్బున్నోళ్లు అక్కడ దొరికిన వాటిని కొనుక్కుని ఆకలి తీర్చుకున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Traffic jam  china  Beijing  Traffic  ten days in traffic  

Other Articles