chandrababunaidu | Betting | ap | telangana | cash for vote case

Betting on chandrababu naidu for his arrest

chandrababunaidu, babu, Betting, ap, telangana, cash for vote case, Revanth Reddy

Betting on chandrababu naidu for his arrest. Some group of betting batch commence to bet on chandrababu naidu.

చంద్రబాబు మీద బెట్టింగ్

Posted: 06/18/2015 03:22 PM IST
Betting on chandrababu naidu for his arrest

ఏపి సిఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంటూ పుకార్లు షికార్ చేస్తున్నాయి. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల్లో జనాలు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందా అన్న టెన్షన్ లో ఉన్నారు. అయితే ఇదే అదునుగా బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. నిన్నటి దాకా క్రికెట్ లోనో లేదా ఎలక్షన్ లో పలానా పార్టీ గెలుస్తుందని బెట్టింగ్ కట్టిన వాళ్లు ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవుతారా..? లేదా..? అంటూ బెట్టింగ్ లు కాస్తున్నారు. ఆయన అరెస్ట్ అవుతారని కొందరు, అలా అయ్యే ప్రసక్తే లేదని మరికొందరు కాయ్ రాజా కాయ్ అంటున్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇష్యూపై వందల కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతున్నట్టు సమాచారం.

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్, ఆ తర్వాత టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలకు నోటీసులు, అనంతరం వేం నరేందర్ రెడ్డి విచారణ. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుకు నోటీసులు ఇస్తారని, ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారని రెండు రోజులుగా పుకార్లు పుట్టాయి. అవి మరింత జోరందుకున్నాయి. వాస్తవానికి ఆయనకు ఏసీబీ నుంచి కనీసం నోటీసులు కూడా అందలేదు. ఈలోపే పందెం రాయుళ్లు పని ప్రారంభించారు. మరోవైపు రెండు రాష్ర్ట ప్రభుత్వాలు వ్యూహ - ప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. ఇటు చంద్రబాబు, అటు కేసీఆర్.. ఎవరి ప్రణాళికల్లో వారున్నారు.  ఏ క్షణం ఏమవుతుందోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. సరిగ్గా ఈ ఉత్కంఠ పరిస్థితులే బెట్టింగ్ బంగార్రాజులకు కలిసివచ్చాయి. చంద్రబాబు అరెస్ట్ అవుతారని కొందరు, అబ్బే అలాంటిదేమీ జరగదని మరికొందరు.. ఇలా ఎవరికి వారు బెట్టింగ్ కు సై అంటున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababunaidu  babu  Betting  ap  telangana  cash for vote case  Revanth Reddy  

Other Articles