cpi leader gunda mallesh makes controversial comments on cm kcr | telangana jobs

Cpi leader gunda mallesh controversial comments cm kcr telangana jobs

gunda mallesh, cm kcr, telangana jobs, jobs offers, jobs updates, telangana jobs updates, mallesh news, gunda mallesh controversy, kcr controversy, kcr cases

cpi leader gunda mallesh controversial comments cm kcr telangana jobs : Former MLA and CPI Leader Gunda Mallesh makes controversial comments on cm kcr that he can't give a job for everyhome.

ఉద్యోగం కాదు కదా.. కనీసం కోడి ఈక కూడా ఇవ్వలేరు!

Posted: 06/18/2015 10:38 AM IST
Cpi leader gunda mallesh controversial comments cm kcr telangana jobs

ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ‘ఓటుకు నోటు’ వ్యవహారాన్ని కాస్త పక్కన పెడితే.. తెలంగాణ సీఎం కేసీఆర్ పై సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను ఆయన ఏకిపారేశారు. నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పిస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ పేర్కొంటూ వస్తున్నారు.

ఆ వ్యాఖ్యలపై స్పందించిన మల్లేష్.. ‘ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెబుతున్న కేసీఆర్.. ఊరికో కోడి, ఇంటికో ఈక కూడా ఇవ్వలేని స్థితిలో వున్నారు’ అని మల్లేష్ ఆరోపించారు. విద్యారంగ సమస్యలపై హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా మల్లేష్ ఈ విధంగా కేసీఆర్ మీద మండిపడ్డారు.

ఈ నేపథ్యంలోనే ఆయన కేసీఆర్ పై నిప్పులు చెరుగుతూ.. కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకునే దమ్ము కేసీఆర్ కు వుందా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్ తెలంగాణ యాస-భాష నేర్చుకుని, ప్రజలకు మెస్మరైజ్ చేస్తూ పాలన కొనసాగిస్తున్నారని ఆయన విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gunda mallesh  cm kcr  vote for note  telangana jobs  

Other Articles