cardon search | police | ameerpet, srnagar | andhra youth

Police cardon search in ameerpet and sr nagar hostels

cardon search, police, ameerpet, srnagar, andhra youth, ap, telangana

police cardon search In ameerpet and sr nagar hostels. Hyderabad police cardon search in hostels where andhra youth magerly staying. On going ap, telangana cleshesh got new issue on cardon search.

తెలంగాణ సర్కార్ టార్గెట్ ఆంధ్రా యూత్..?

Posted: 06/18/2015 10:27 AM IST
Police cardon search in ameerpet and sr nagar hostels

తెలుగు రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న పరిణామాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో సెక్షన్-8 ను అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్న ఏపి ప్రభుత్వం తాజాగా తన స్ట్రాటజీని మార్చిందా లేదా తెలంగాణ సర్కార్ అతిగా చేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్ లోని మెన్స్ హాస్టల్లలో నగర పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రాంత యువకులు ఎక్కువ మంది ఉంటారని భావించే ప్రాంతాల్లోని హాస్టళ్లమీద దాడులు నిర్వహించడం అనేది ప్రాధాన్యం సంతరించుకుంటున్నది. అయితే గత కొంత కాలంగా చార్మినార్ ఘటన తర్వాత పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహిస్తున్నా కానీ తాజా సెర్చ్ మాత్రం వార్తల్లో నిలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేసినా మండేలా ఉంది పరిస్థితి. అయితే హైదరాబాద్ లో ఉంటున్న సీమాంధ్రులకు రక్షణ లేకుండా పోయిందని కాబట్టి విభజన చట్టంలోని సెక్షన్ 8ను అమలు చెయ్యాలని ఏఫి ప్రభుత్వం ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. అందులో భాగంగా ప్రధానిని, గవర్నర్ ను కలిసిన చంద్రబాబు తగిన విధంగా హామీ పొందలేకపోయారని అందుకే ప్లాన్ మార్చినట్లు తెలంగాణ అధికారులు అనుకుంటున్నారు. హైదరాబాదులో అల్లర్లను సృష్టించడానికి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని, ఆంధ్ర ప్రాంతంనుంచి అల్లరిమూకలను నగరానికి తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉన్నదని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. అయితే హైదరాబాద్ లో అల్లర్లు జరిగితే శాంతి భద్రతలకు ఇక్కడ గ్యారెంటీ లేదని ముందే చెప్పాం కాబట్టి ఇప్పటికైనా సెక్షన్ 8ను అమలు చెయ్యండి అని ఏపి ప్రభుత్వం వత్తిడి తీసుకురావాలని ప్రయత్నిస్తోందని తెలంగాణ ప్రభుత్వం చర్చించుకుంటోంది.

అందులో బాగంగానే ఆ:ధ్రా యూత్ ఎక్కువగా ఉండే అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లోని మెన్స్ హాస్టల్స్ పై పోలీసులు కార్డాన్ సెర్చ నిర్వహించారు. అయితే ఈ సెర్చ్‌కు ఎలాంటి ప్రత్యేకత లేదని, శాంతిభద్రతల కోసం నిర్వహించే రెగ్యులర్‌ సెర్చ్‌ లాంటిదేనని పోలీసులు చెబుతున్నారు. సరైన ఆధారాలు చూపించలేని 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌత్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 15 ఇన్స్‌పెక్టర్లు, 40 మంది ఎస్సైలు, 300 మంది పోలీసులు 40 బృందాలుగా మొత్తం ఈ సెర్చ్‌లో పాల్గొనడం విశేషం.  తాజాగా అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్ లో జరిగిన కార్డాన్ సెర్చ్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cardon search  police  ameerpet  srnagar  andhra youth  ap  telangana  

Other Articles