Chandrababu naidu | Pooja | Amaravati | Ap | capital

Ap cmchandrababu naidu likely to do shanti pooja

Chandrababu naidu, Pooja, Amaravati, Ap, capital

ap cmchandrababu naidu likely to do shanti pooja. After amaravati pooja chandrababu naidu and TDP facing problems so chandrababu naidu may do pooja.

చంద్రబాబు శాంతిపూజలు చేస్తే సెట్ అవుతుందా..?

Posted: 06/18/2015 09:08 AM IST
Ap cmchandrababu naidu likely to do shanti pooja

ఏపి సిఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు గత రెండు వారాల నుండి అస్సలు కలిసిరావడం లేదు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టిటిడిపి కీలక నేత రేవంత్ రెడ్డి అరెస్టు, అదే వివాదంలొ చంద్రబాబు నాయుడు ఆడియో టేపుల విడుదలతో చిక్కుల్లో పడ్డారు. అయితే అంతా సజావుగా సాగుతోందని.. మంచి ముహూర్తం చూసి మరీ అమరావతికి బొడ్రాయి పూజ చేసిన తర్వాత నుండి చంద్రబాబు నాయుడుకు మరిన్ని కష్టాలు వస్తున్నాయి. అయితే అమరావతి పూజ చేసిన తర్వాత అంటే బొడ్రాయి పూజ తర్వాత నిర్వహించాల్సిన కొన్ని పూజలు నిర్వహించలేదని అందుకే కాస్త కష్ట కాలం వచ్చిందని పండితులు అనుకుంటున్నారు. అయితే అంతకు ముందే కొంత మంది పండితులు అమరావతి పూజకు నిర్ణయంచిన ముహూర్తం బాగోలేదని కూడా వాదించారు. అయితే వాటిని చంద్రబాబు నాయుడు పట్టించుకోకుండా అమరావతి పూజకు సిద్దపడ్డారు. అయితే తాజాగా పరిణామాల నేపథ్యంలొ చంద్రబాబుకు ఎదురౌతున్న కష్టకాలంపై పండితులు చర్చిస్తున్నారు.

రాజధాని అమరావతి బొడ్రాయి పూజ తర్వాత పిర్వహించాల్సిన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే సరిపోతుందని కూడా పండితులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అమరావతి కి పూజ చేసిన ప్రదేశంలోనే పూజలు నిర్వహించాలని చంద్రబాబు నాయుడు ఆధ్యాత్మిక విషయాలను చూసే యోగం నాయుడుతో పాటు మరికొందరు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా గుంటూరు జిల్లా కలెక్టర్ తో యోగం నాయుడు మరికొందరు పండితులు సమావేశమైనట్లు తెలుస్తోంది. అమరావతి పూజ తర్వాత చేయాల్సిన శాంతి పూజలను త్వరగా పూర్తి చెయ్యాలని వారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా పూజకు హాజరుకావాలా..? లేదా..? అన్న దానిపై క్లారిటీ రావాల్సింది. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడుకు కాస్త కష్ట కాలం నడుస్తోందని.. కానీ అది కొద్ది కాలమే అని త్వరలోనే అన్ని సర్దుమణుగుతాయని పండితులు విశ్లేషిస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu naidu  Pooja  Amaravati  Ap  capital  

Other Articles