EC orders Telangana ACB to probe deeply into cash for vote scam

Election commission reacts on cash for vote case in telangana

Ak Khan, ACB, election commision, letter, cash for vote, TRS Government mind game, note for vote, governer, chandrababu, KCR, High Court Judge, RGV, muthaiah jerusalem, chandra babu, revanth reddy, acb, note for vote, bribery case, horse riding, Kcr, telangana mlc elections, revanth reddy bail, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, acb, sunita reddy, geeta reddy, jaipal reddy, jana reddy, horse riding

Election commission writes letter to Teleangan acb dg AK Khan to probe deeply into cash for vote scam and orders to give a detailed report.

లాజికల్ యాంగిల్ కనుగోనాలని ఏసిబికి ఈసి ఆదేశం

Posted: 06/17/2015 06:11 PM IST
Election commission reacts on cash for vote case in telangana

ఒటుకు నోటు వ్యవహరాంలో గత పక్షం రోజులుగా మిన్నకుండిన ఎన్నికల కమీషన్.. ఎట్టకేలకు ఈ వ్యవహరంలో స్పందించింది. ఎన్నికల కోడ్ అములలో వుండగా, రేవంత్ రెడ్డిని ఏసీబి అధికారులు అరెస్టు చేయడమేంటని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఇన్నాళ్లు వాదించిన టీడీపీ నేతలకు మింగుడు పడని విధంగా ఎన్నికల కమీషన్ స్పందించింది. రేవంత్ రెడ్డి అరెస్టుకు ముందే ఎన్నికల కమీషన్ దృష్టికి ఓటుకు నోటు వ్యవహరాన్ని ఏసిబి డీజీ ఏకే ఖాన్ తీసుకెళ్లడంతో.. ఇన్నాళ్లకు ఈ వ్యవహారంపై ఈసీ స్పందించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న భన్వర్‌లాల్‌ ఈ కేసుకు సంబంధించి పంపిన లేఖకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతిస్పందిస్తూ తాజా లేఖ పంపింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరగనందున ప్రస్తుతం ఈ కేసులో జోక్యం చేసుకోబోమని కూడా కేంద్ర ఎన్నికల సంఘం తన లేఖలో స్పష్టం చేసింది. ఈ కేసులో తెలంగాణ ఏసీబీ చివరివరకూ దర్యాప్తు కొనసాగించాలని సూచిస్తూ ఎన్నికల సంఘం లేఖ పంపింది. పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆ లేఖలో ఈసీ సూచించింది.
 
కాగా, ఇదే కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డిని అరెస్ట్ చెయ్యడానికి ముందే ఈసీకి తెలంగాణ ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్‌ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో సమగ్రంగా దర్యాప్తు చేయాలని, విచారణ సజావుగా సాగాలని ఏకే ఖాన్ కు లేఖ రాసింది. ఓటుకు నోటు వ్యవహరాంలో పూర్తిగా విచారణ  చేయాలని ఏసిబి డిజీ ఏకే ఖాన్ కు ఆదేశించిన ఈసి కేసులో లాజికల్ ఎండ్ కనుక్కోవాలని సూచించింది.  కాగా ఈ వ్యవవారంలో ఏసీబి డీజీ ఏకే ఖాన్ ఇప్పటి వరకు రెండు పర్యాయాలు ఈసికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Ak Khan  ACB  election commision  letter  

Other Articles