Telangana, ap, Tapping, data, calldata, telecom operator

Telangana state govt likely to orde the telecom operates to dont reveal the details of telangana state vips

Telangana, ap, Tapping, data, calldata, telecom operator

Telangana state govt likely to orde the telecom operates to dont reveal the details of telangana state VIPs. ap govt trying to get the call data and tapping details from telecom operators.

వివరాలు ఇవ్వొద్దంటూ టెలికాం ఆపరేటర్లకు టి.సర్కార్ హుకుం..!?

Posted: 06/18/2015 07:50 AM IST
Telangana state govt likely to orde the telecom operates to dont reveal the details of telangana state vips

తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు తారా స్థాయికి చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం దుదుడుకు వైఖరికి ఏపి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఒక్కరిబిక్కిరి అవుతున్నారు. అయితే ట్యాపింగ్ వివాదంపై 24 గంటల్లో సంచనం వస్తోంది అంటూ ఏపి ప్రభుత్వం హెచ్చరించి తెలుగు రాష్ట్రాల్లో మరింత వేడి పుట్టించారు. అయితే తాజాగా ఏపి ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ ఝలక్ ఇస్తోంది. నిన్నటి దాకా ఓటుకు నోటు కేసుపై దృష్టిసారించిన తెలంగాణ సర్కార్ ట్యాపింగ్ పై కాంసట్రేట్ చేసింది. ఏపి ప్రభుత్వం వాదిస్తున్నట్లు ట్యాపింగ్ వివాదంపై టి సర్కార్ అడుగులు ముందుకు వేసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తమకు కొంత సమాచారం కావాలంటూ ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ విభాగం సర్వీస్‌ ప్రొవైడర్లకు గురువారం నోటీసులు జారీ చేయటానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టీ-అధికారులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.

ట్యాపింగ్ వివాదంపై ఏం జరిగింది? ఏం జరుగుతోంది? విషయం తెలుసుకోండి’ అని హోం శాఖ కార్యదర్శి బి.వెంకటేశాన్ని టీ-సర్కారు ఆదేశించింది. దీంతో మంగళవారం ఆయన ప్రైవేట్‌ టెలికాం ఆపరేటర్లతో సమావేశమైనట్లు తెలిసింది. ఎలాంటి సమాచారాన్నీ బయటికి ఇవ్వొద్దంటూ హుకుం జారీ చేసినట్లు సమాచారం. దీనిపై టెలికాం ఆపరేటర్లకు వెంకటేశం స్పష్టమైన సూచనలు చేసినట్లు తెలిస్తోంది. తెలంగాణకు చెందిన నేతలు, ముఖ్యమైన వ్యక్తులకు సంబంధించిన సమాచారమేదీ బయటికి ఇవ్వొద్దని ఆయన వారిని ఆదేశించినట్లు సామాచారం.  అంతేకాదు! కొందరు వ్యక్తుల కాల్‌ డేటాకు సంబంధించి తెలంగాణ పోలీసుల వైపు నుంచి అందిన లేఖలను, సంబంధిత డాక్యుమెంట్లను వెనక్కి ఇచ్చివేయాలని కోరినట్లు తెలిసింది. ఒక్క సర్వీసు ప్రొవైడర్‌ మాత్రమే తమకు అందిన లేఖలను వెనక్కి ఇచ్చారని... మరో ప్రధాన ఆపరేటర్‌ ఇందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ సర్కార్ ఏపి ప్రభుత్వం అంటున్నట్లు ట్యాపింగ్ పై తెలంగాణ సర్కార్ చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందని సమాచారం. మరి ట్యాపింగ్ వివాదంపై ఏపి వాదిస్తున్నట్లు ఆధారాలు బయటకు వస్తాయో లేదో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  ap  Tapping  data  calldata  telecom operator  

Other Articles