rain creates havoc in greater hyderabad

Cars wash away after heavy rain in twin cities

rain creates havoc in greater hyderabad, cars wash away after heavy rain in twin cities, heavy rain, twin cities, cars wash away, hyderabad, secundrabad, traffic jam, rain water, greater hyderabad, havoc situation

Heavy rain created havoc in Greater Hyderabad, causes hevy traffic jam, few cars washed away in rain water

ఏకధాటిగా కురిసిన వర్షం.. జలపాతాలను తలపించిన రోడ్లు.. ఎక్కడికక్కడే నిలిచిన వాహనాలు

Posted: 06/12/2015 09:51 PM IST
Cars wash away after heavy rain in twin cities

జంటనగరాల్లో ఇవాళ సాయంత్రం కురిసని భారీవర్షం నగరవాసులను అనేక ఇబ్బందులకు గురిచేసింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మొదలైన వర్షం దాదాపు గంటన్నర, రెండు గంటల పాటు ఏకథాటిగా కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు చిన్న తరహా జలపాలాలను తలపించాయి. పలు చోట్ల వర్షం ధాటికి రోడ్లపై నీరు ఏర్లుగా ప్రవహించాయి. వర్షం నీరు ఎక్కడికడ్కడ రోడ్లపై నిలచిపోవడంతో.. ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల్లో అయితే కొన్ని కార్లు, ద్విచక్ర వాహనాలు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. కూకట్పల్లి, మియాపూర్ ప్రాంతాల వైపు నుంచి వచ్చే వాహనాలు దాదాపు గంటకు పైగా ట్రాఫిక్ జామ్ కారణంగా నిలిచిపోయాయి.

రెండు గంటలపాటు ఆగకుండా కురిసిన వానతో దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, అక్బర్ బాగ్, ఓల్డ్ మలక్‌పేట్, కాలాడేరా, మలక్‌పేట్ రైల్వే బ్రిడ్జి, సైదాబాద్, సరూర్‌నగర్, మీర్‌పేట్, జిల్లెలగూడ, కొత్తపేట్, బడంగ్‌పేట్ తదితర కాలనీలు, బస్తీలు జలమయంగా మారాయి. మలక్‌పేట్, నల్లగొండ క్రాస్‌రోడ్డు, సైదాబాద్, సరూర్‌నగర్, ఆర్‌కేపురం తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయింది. మైత్రీవనం, సికింద్రాబాద్ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ బాగా నిలిచిపోయింది. సికింద్రాబాద్ ప్రాంతంలో వర్షపునీరు వరదలా పొంగి పారుతుండటంతో డ్రైనేజి గోతిలోకి ఆర్టీసీబస్సు కూరుకుపోయింది. అంబర్పేట, ఛేనెంబర్ చౌరస్తా ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. అంబర్ పేట్ లో వర్షం నీరు నిలచిపోవడంతో కార్లు కూడా నీటీలో కోట్టుకుపోయాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : heavy rain  twin cities  cars wash away  hyderabad  secundrabad  

Other Articles