wife caught husband cheating and doing second marriage

Wife thrashes husband who goes for second marriage

cheating to marriages, second marriage, kiran varma, manjula, vinod, tandur police, rangareddy district, crime against women, violence against women, harrasement against women, first wife thrashes husband,

wife caught husband and thrashes him for cheating and doing second marriage in tandur, rangareddy district

రెండో పెళ్లి చేసుకుంటున్న భర్తకు ‘పెళ్లి’ చేసిన భార్యామణి

Posted: 06/12/2015 10:13 PM IST
Wife thrashes husband who goes for second marriage

రెండో పెళ్లి చేసుకోవాలని ఆ దిశగా ఏర్పాట్లు చేసుకున్న ఓ భర్తకు తన భార్య ‘పెళ్లి’ చేసింది. అయితే అలా ఇలా కాకుండా పెద్దవాళ్లు కోపంతో అంటారే.. ఓరేయ్ నీకు పెళ్లి చేస్తాను అని.. సరిగ్గా అలాగే తన భర్త రెండో పెళ్లి సమాచారం అందుకున్న మొదటి భార్య తన బంధువులతో వివాహవేదికకు వచ్చిన తన బంధుజనం చూస్తుండగానే తన భర్తకు పెళ్లి చేసింది. అయితే తన కూతురు కాబోయే వరుడికి ఇదివరకు పెళ్లైందన్న విషయం తెలుసుకుని మనస్తాపానికి గురైయ్యూ వధువు వర్గీకలు కూడా లక్కీగా మరో వరుడు అందుబాటులోకి రావడంతో ఇ వ్యక్తికి వధువునిచ్చి పెళ్లి చేశారు పెద్దలు.

రంగారెడ్డి జిల్లా తాండూరు పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటన సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. తాండూరు అర్బన్ సీఐ వెంకట్రామయ్య కథనం ప్రకారం..  ఘట్‌కేసర్ మండలం రాంపల్లికి చెందిన మంజులకు 1989లో వినోద్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. రెండేళ్ల తరువాత ఇద్దరూ విడిపోయారు. తరువాత 2004 సంవత్సరంలో లంగర్‌హౌస్‌కు చెందిన తన మేనమామ కొడుకు గాజర్ల కిరణ్‌వర్మను పెళ్లి చేసుకున్నారు. సేల్స్ రిప్రసెంటేటివ్ గా పనిచేసే కిరణ్‌వర్మ, మంజుల ఇద్దరు కొంతకాలం విశాఖపట్నంలో నివసించారు. రెండేళ్ల క్రితం ఇద్దరు హైదరాబాద్‌కు వచ్చారు.

తాజాగా తాండూరు పట్టణానికి చెందిన ఓ అమ్మాయితో తెలిసిన వారి ద్వారా కిరణ్‌వర్మ పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. తనకు ఇదివరకే పెళ్లి జరిగిన విషయాన్ని దాచిపెట్టాడు. శుక్రవారం ఉదయం 11.15 గంటలకు మంచి ముహూర్తం ఉందని, అదే ముహూర్తానికి పెళ్లి చేయాలని ఒత్తిడి తెచ్చాడు. వరకట్నం కింద రూ.లక్ష నగదు, నాలుగు తులాల బంగారం ఇతర కానుకలు మాట్లాడుకున్నారు. వధువు తరఫున కుటుంబ సభ్యులు స్థానిక దేవాలయంలో ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్న సమాచారం తెలుసుకున్న మంజుల గురువారం రాత్రే కీసర పోలీసుస్టేషన్‌కు వెళ్లి వివరాలు తెలిపింది.

మంజుల తన తండ్రి రాజేశ్వరరావు, సోదరుడు బాల్‌రాజ్‌లతో కలిసి తాండూరుకు రాత్రి చేరుకున్నారు. శుక్రవారం ఉదయమే మంజుల పోలీసుస్టేషన్‌కు వెళ్లి తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడని, ఆధార్‌కార్డు, ఫొటోలు తదితర ఆధారాలు పోలీసులకు చూపించింది. పోలీసులు వధువు తరఫు వారికి జరిగిన విషయం తెలపడంతో మొదట షాక్ తిన్నారు. పోలీసులు రంగం ప్రవేశం చేసి, కిరణ్‌వర్మను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. వరుడి తరఫున వచ్చిన కొందరు దగ్గర బంధువులు మినహా అందరూ అక్కడి నుంచి ఫలాయనం చిత్తగించారు. ఈ మేరకు చీటింగ్ కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్టు సీఐ చెప్పారు. కాగా రెండో పెళ్లి తప్పిపోవడంతో వధువు కుటుంబ సభ్యులు సంతోషపడ్డారు. కూతురు పెళ్లి ఆగిపోవద్దని భావించి కొన్ని గంటల వ్యవధిలో గతంలో అనుకున్న బంధువుల అబ్బాయికిచ్చి పెళ్లి జరిపించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : second marriage  kiran varma  manjula  vinod  tandur police  

Other Articles