botsa satyanarayana takes on Tdp government, slams chandrababu

Botsa satyanarayana joins ysr congress party

ysr congress party, chandrababu, botsa joins ysrcp, bothsa sathya narayana,ysrcp, ys jagan mohan reddy, Tdp government, chandrababu, government schmes

botsa satyanarayana takes on Tdp government, slams chandrababu saying that NTR soul is being hurt on implementation of government schmes

బాబు పథకాల ఆచరణ తీరు చూస్తే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది..

Posted: 06/07/2015 12:42 PM IST
Botsa satyanarayana joins ysr congress party

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదివారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. బొత్స సత్యనారాయణకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బొత్సతో పాటుగా ఆయన సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పల నరసయ్య, బొత్స అప్పలనాయుడు, డీసీసీబీ చైర్మన్ తులసి, డీసీఎంఎస్ చైర్మన్ రమణరాజు, పీసీసీ ప్రధాన కార్యదర్శి యడ్ల రమణమూర్తి, మాజీ జెడ్పీటీసీ ఉప్పాక సూర్యనారాయణ, డీసీసీ మాజీ చైర్మన్ పిల్లా విజయ్ కుమార్ లతో పాటుగా విజయనగరం జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై పోరాడేందుకే తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అంతేకాని పదవుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఆయన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో లోటస్ పాండ్లోని పార్టీ కార్యాలయంలో బొత్స సత్యనారాయణ.. తన కుటుంబ సభ్యులతోపాటు చేరారు.  విజయ నగరం జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు కూడా బొత్సతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్లో ఉండి పోరాడలేమనే.. వైఎస్ఆర్సీపీలో చేరాను తప్ప.. ఎలాంటి పదవులను ఆశించి మాత్రం కాదని ఆయన చెప్పుకోచ్చారు. తన రాజకీయ అనుభవమంతా వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం వినియోగిస్తానని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలకు సమష్టి బాధ్యత వహిస్తామని చెప్పుకోచ్చారు.

రుణమాఫీ కోసం బడ్జెట్లో రూ.9 వేల కోట్లు కేటాయించి.. రూ.24 వేల కోట్ల మాఫీ చేశామని చంద్రబాబు చెప్పుకుంటున్నారని, ఆయన పథకాల ఆచరణ తీరు చూస్తే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందని పేర్కోన్నారు. ప్రజల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తినని, వారి అండగా వుంటూ.. పార్టీ పిలుపు మేరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని, చంద్రబాబు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుకు ఎండగడుతూ ప్రజల తరుపున పోరాడుతామని చెప్పారు. అభివృద్ధిని ఒకేచోటే కేంద్రీకరించేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏపీలో టీడీపీకి ప్రత్యామ్నాయం వైఎస్సార్సీపీనేని బోత్స చెప్పుకోచ్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bothsa sathya narayana  ysrcp  ys jagan mohan reddy  

Other Articles