Serena Williams wins French Open for 3rd time

Serena williams wins french open for third time

Serena Williams has won the French Open title for the third time after beating Lucie Safarova, top-ranked American, serena won 20 Grand Slam titles, Sports, Homepage Showcase, Mobile Showcase, Tablet Showcase

Serena Williams has won the French Open title for the third time after beating Lucie Safarova 6-3, 6-7 (2), 6-2

నల్ల కలువ వశమైన ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్..!

Posted: 06/06/2015 10:40 PM IST
Serena williams wins french open for third time

అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్.. ఫ్రెంచ్ ఓపెన్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించాలన్న లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) ఆశలు ఆవిరయ్యాయి. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సెరెనా.. 6-3, 6-7, 6-2 స్కోరుతో సఫరోవాపై విజయం సాధించింది. తొలి సెట్ ను అవలీలగా గెలిచిన సెరెనా.. అనవసర తప్పిదాలతో రెండో సెట్ ను  కోల్పోయింది.

అయితే నిర్ణయాత్మకమైన మూడో గేమ్ లో మాత్రం సెరెనాను సఫరోవా నియంత్రించేందుకు గట్టిగా యత్నించింది.  ఓ దశలో సెరెనా సర్వీస్ ను బ్రేక్ చేసి కాస్త ముందంజంలో కనిపించింది.  కాగా, సెరెనా తన అనుభవాన్ని ఉపయోగించి మూడో గేమ్ ను కైవసం చేసుకుని ట్రోఫీని చేజిక్కించుకుంది. దీంతో సెరెనా కెరీర్లో 20వ గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ ను సాధించినట్లయ్యింది. వ్యక్తిగతంగా సఫరోవాపై సెరెనాకు 9వ విజయం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : serena william  french open  title winner  

Other Articles