Cash for vote scam: ACB to question Revanth Reddy

Cash for vote case mla revanth reddy taken into acb custody

cash for vote, Revanth reddy, chandrababu, TDP, MLA's and MLC's, ACB, cherlapally, chanchalguda jail, Telangana TDP Mla, nominated mla stephen, anglo-indian stephen, Telangana government, TDP leaders, disciplenary action on revanth reddy, suspension on revanth reddy, ap officials, TDP party leaders

Telangana Tdp mla Revanth Reddy cash for vote episode, ACB court agrees for 4 days acb custody

నాలుగు రోజుల ఏసీబీ కస్టడీలో రేవంత్ రెడ్డి నిజాలను చెబుతాడా..?

Posted: 06/05/2015 05:19 PM IST
Cash for vote case mla revanth reddy taken into acb custody

ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని లోతుగా విచారించాలని, ఆయన పేర్కొన్న బాస్, ఎవరో తెలుసుకోవాలని అందచేత ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని ఏసీబి అధికారులు దాఖలు చేసిన పిటీషన్ పై ఏసీబీ కోర్టు సానుకూలంగా స్పందించింది. ఏసీబి అధికారులు కోరినట్లు ఐదు రోజుల పాటు కాకుండా కేవలం నాలుగు రోజుల పాటు మాత్రమే కస్టడీ న్యాయస్థానం అనుమతినిచ్చింది. శుక్రవారం సాయంత్రం ఏసీబీ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని విచారించనున్నారు.

రేవంత్ రెడ్డిని నాలుగు రోజులూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కస్టడీలోకి తీసుకుంటారు. అయితే ప్రతిరోజు రేవంత్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నా.. న్యాయవాది సమక్షంలోనే అతడిని ప్రశ్నించాలని న్యాయస్థానం షరుతు విధించింది. ఈ కేసులో రేవంత్ రెడ్డితో పాటు నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహాలను కస్టడీకి అప్పగించారు. కస్టడి ముగిశాక నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా ఈ నెల 8వ తేదీన రేవంత్ రెడ్డి బెయిల్ పిటీషన్ కూడా విచారణకు రానుంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్కు ముడుపులు ఇస్తూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా ఏసిబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే.

అయితే ఈ నాలుగు రోజుల పాటు తనను అదుపులో తీసుకుని ప్రశ్నించనున్న ఏసీబి అధికారులకు రేవంత్ రెడ్డి నిజాలను వెల్లడిస్తాడా..? లేదా..?. ఏసీబీ అధికారులు దర్యాప్తుకు రేవంత్ సహకరిస్తాడా లేదా..?  టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ తో భేటీలో భాగంగా బాస్ అని ఆయన ఎవరిని సంబోధించాడు..? బాబు అంటే చంద్రబాబా..? లేక మరెవరు..? రేవంత్ రెడ్డితీ ఎవరు ఈ పని చేయించారు..? రేవంత్ రెడ్డి పీకపై కత్తి పెట్టినంత రిస్క్ ఎలా అయ్యింది.? ఈ మొత్తం ఎపిసోడ్ కు కర్త, కర్మ, క్రియ అదేనండి.. డైరెక్షన్ ఎవరు..? అన్న వివరాలను ఏసీబి రాబట్టగలుగుతుందా..? అందుకు రేవంత్ సహరిస్తాడా..? అన్నది వేచి చూడాల్సిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cash for vote  Revanth reddy  acb court  anti corruption bureau  

Other Articles