Researchers claim horror films shows affecting a childs wellbeing is a myth | horror movies good for children

Researchers claim horror films shows affecting a childs wellbeing is a myth

horror movies, children watching horror movies, research centers, hollywood news, researches, Human Communication Research, children health news, children growth tips

Researchers claim horror films shows affecting a childs wellbeing is a myth : If you think that watching horror films or shows can affect your child's wellbeing, then you are just over exaggerating. A University of Sussex research has shown that a small minority of children can have extreme reactions to a scary programme or film.

భయంకర సినిమాలు చూస్తే.. చిన్నపిల్లలకు మంచిదట!

Posted: 06/04/2015 10:00 AM IST
Researchers claim horror films shows affecting a childs wellbeing is a myth

దెయ్యాల నేపథ్యంలో తెరకెక్కే హారర్ సినిమాలను చూడటానికి ఎంతోమంది భయపడతారు. ఇక తమ పిల్లలను సైతం ఆ తరహా సినిమాలను ఎట్టిపరిస్థితుల్లోనూ చూడనివ్వరు. ఎందుకంటే.. దెయ్యాల సినిమాలు చూసి రాత్రివేళల్లో భయాందోళనలకు గురై.. మానసిక సమస్యలు తెచ్చుకుంటారన్నది పెద్దల భయం. అందుకే.. తమతోపాటు తమ పిల్లల్ని సైతం దెయ్యాల సినిమాలు చూడనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

అయితే.. అటువంటి భయాలేమీ పెట్టుకోకుండా చిన్నారులను హారర్ సినిమాలు చూడనివ్వండని లండన్ పరిశోధకులు అంటున్నారు. భయంకర చిత్రాలు చూసి పిల్లలు భయపడతారన్న విషయంలో ఏమాత్రం వాస్తవం లేదని వారు పేర్కొంటున్నారు. కేవలం చాలా కొంద్దిమంది మాత్రమే ఈ తరహా సినిమాలు చూసి భయాందోళనకు గురవ్వడమో, మానసిక సమస్యలను ఎదుర్కోవడమో వంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంటారని వారు తమ పరిశోధనల ద్వారా వెల్లడిస్తున్నారు. ఆ కొద్దిమంది ఎందుకు భయపడతారోనన్న విషయమై మరింత పరిశోధన జరగాల్సి వుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఫీల్డ్ అనే పరిశోధకుడు వెల్లడించాడు.

దెయ్యాల సినిమాలు చూడటం వల్ల పిల్లలు మరింత చురుకుగానూ, ధైర్యంగానూ తయారవుతారని నిపుణులు అంటున్నారు. అయితే.. వారిని ఒంటరిగా చూడనివ్వకుండా నలుగురు కూర్చొని చూస్తే మంచిదని వారు సూచిస్తున్నారు. ఈ అధ్యయనం వివరాలు ‘హ్యూమన్ కమ్యూనికేషన్ రీసెర్చ్’ అనే జర్నల్ లో ప్రచురితమయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : horror movies  children watching tv  Human Communication Research  

Other Articles