Telangana, spy, TDP, TRS, KCR, Chandrababu, Revanth Reddy

Telangana state officials spy eye on telugudesam party

Telangana, spy, TDP, TRS, KCR, Chandrababu, Revanth Reddy

Telangana state officials spy eye on telugudesam party. TRS party target the Telugudesam party in ap and specially in telangana.

టిడిపి గుట్టు టిఆర్ఎస్ చేతిలో..?

Posted: 06/04/2015 09:35 AM IST
Telangana state officials spy eye on telugudesam party

మూడు రోజుల క్రితం టిటిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచనలం రేపింది. అయితే రేవంత్ రెడ్డిని సాక్షాలతో సహా పట్టుకోవడానికి టిఆర్ఎస్ నాయకులు ఎంతో హోం వర్క్ చేసినట్లు సమాచారం. చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ నేతలపై నిఘా నేత్రం ఉంచినట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఇదే వార్తల్లో ప్రధాన వార్తగా మారింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో సహా పార్టీకి చెందిన కీలక నేతలు అందరిపైనా తెలంగాణ ప్రభుత్వం నిఘా ఉంచిందా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులు ఉన్నాయని చెప్పడమే ఇందుకు నిదర్శనం. అయితే ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీ నేతల మీద, వారు ఎవరెవరిని కలుస్తున్నారు..? ఎక్కడెక్కడికి వెళుతున్నారు..? ఏం చేస్తున్నారు..? ఇలా మొత్తం సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఏపిలో తెలుగుదేశం పార్టీ, తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాయి. అయితే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పూర్తిగా నాశనం కాలేదు. టిఆర్ఎస్ గత కొంత కాలంగా టిడిపిని టార్గెట్ గా చేస్తుండటం.. ఎలాగైనా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి చరమగీతం పాడాలని అనుకోవడంతో.. టిడిపి మీద నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాలు అబివృద్దిలో పోటీ పడాలి అనుకుంటున్న వారి కల కల్లగానే కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పార్టీల పరంగా ఆలోచన ప్రభుత్వంలోనూ మార్పులు తీసుకువస్తోంది. పార్టీకి లాభం కలిగించాలని.. ప్రభుత్వ అధికారాన్ని ఇలా పార్టీ ప్రయోజనాలకు వాడుకోవడం ఏం బాగోలేదని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి టిడిపి పార్టీ మీద పెట్టిన నిఘా తెలంగాణ కీలక నేత రేవంత్ రెడ్డిని పట్టించడంతో పాటు.. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును కూడా బుక్ చేసింది కదా అని తెరాస నేతలు సంబరపడుతున్నట్లు సమాచారం. మరి ఇది ఎంత వరకు నిజమో తెలంగాణ ప్రభుత్వం, టిఆర్ఎస్ నాయకులు క్లారిటీ ఇవ్వాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  spy  TDP  TRS  KCR  Chandrababu  Revanth Reddy  

Other Articles