Onelakh, Jobs, Telangana, KCR, Notifications

Total one lakh vaccancies in the telangana govt

Onelakh, Jobs, Telangana, KCR, Notifications

Total one lakh vaccancies in the telangana govt. The telangana cm KCR already told that notifications will announce by next month.

తెలంగాణలో లక్షకు పైగా ఉద్యోగాలు

Posted: 06/04/2015 08:46 AM IST
Total one lakh vaccancies in the telangana govt

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున నిరుద్యోగులకు శుభవార్త వినిపించారు ముఖ్యమంత్రి కేసీఆర్. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు నోటిపికేషన్లు విడుదల చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయితే తెలంగాణవ్యాప్తంగా దాదాపుగా లక్ష ఏడు వేల ఉద్యోగ ఖాళీలున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా లెక్క తేల్చింది. ప్రభుత్వం లెక్కతేల్చిన వాటిలో అత్యధికంగా పాఠశాల విద్యాశాఖ, హోం శాఖ, ఉన్నత విద్య, వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, రెవెన్యూ విభాగాల్లో ఖాళీలున్నాయి. పాఠశాల విద్యాశాఖ పరిధిలో 25 వేల పోస్టులు, హోంశాఖలో 15 వేలు, ఉన్నత విద్యాశాఖలో 10 వేలు, వైద్య ఆరోగ్య శాఖలో 11 వేలు, రెవెన్యూ విభాగంలో 10 వేలు, పంచాయతీరాజ్‌లో 7 వేలు, వ్యవసాయంలో 2,200 పోస్టులు, మిగతా విభాగాలన్నింటిలో 27 వేల ఖాళీలున్నాయి.

job-vaccancies-in-telangana

కొన్ని విభాగాల్లో రెండు రాష్ట్రాల ఉద్యోగుల విభజన కొలిక్కి రావడంతో.. తాత్కాలిక కేటాయింపు జాబితాల ఆధారంగా ఈ ఖాళీల సంఖ్యపై నిర్ధారణకు వచ్చింది. సచివాలయం సహా మొత్తం 33 విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. ప్రాధాన్యత క్రమంలో తొలివిడతగా 25 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో ఏఏ విభాగాల్లో, ఏఏ కేడర్‌లో ఖాళీలను భర్తీ చేయాలనే వివరాలపై కసరత్తు మొదలైంది.  ఇటీవలే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన పంచాయతీరాజ్ ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, పోలీసు కానిస్టేబుల్ (డైవర్లు) పోస్టులను అన్నింటికంటే ముందుగా భర్తీ చేసే అవకాశముంది. వీటితోపాటు ప్రభుత్వం విద్యుత్ ప్రాజెక్టులపై అత్యధిక ప్రాధాన్యం కనబరుస్తున్నందున ఆ శాఖలో ఇంజనీర్ల ఖాళీలను తొలి విడతలో భర్తీ చేసే యోచనలో ఉంది. తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంల పరిధిలో ఖాళీగా ఉన్న 1,919 ఏఈలు, సబ్ ఇంజనీర్ల కొత్త పోస్టులకు జూలైలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. మొత్తానికి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాల ప్రకటనలకు ఇక మోక్షం కలగనుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Onelakh  Jobs  Telangana  KCR  Notifications  

Other Articles