Gutta sukhender reddy, Gutha, Eagles, KCR, Chandrababu

Congress senior leader nalgonda mp gutta sukhenderreddy said that kcr and chandrababu naidu as eagles

Gutta sukhender reddy, Gutha, Eagles, KCR, Chandrababu

Congress senor leader, Nalgonda Mp Gutta sukhenderreddy said that kcr and chandrababu naidu as eagles in the telugu states. He condemn the party jumping leaders.

రెండు రాష్ట్రాలు.. రెండు గద్దలు

Posted: 06/04/2015 08:18 AM IST
Congress senior leader nalgonda mp gutta sukhenderreddy said that kcr and chandrababu naidu as eagles

అదేంటి రెండు రాష్ట్రాలకు కేవలం రెండంటే రెండే గద్దలు ఉన్నాయా..? పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందేమో అదీ.. ఇదీ అని ఎక్కడెక్కడో ఆలోచించకండి. ఇక్కడ గద్దలు అంటే రాజకీయ గద్దలు. అవును ఎలాగూ రాజకీయ నాయకులు అంటేనే గద్దల్లా పీక్కుతింటారు అన్న చెడ్డ పేరు ఉండనే ఉంది కదా. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల్లో రెండు గద్దలు తిరుగుతున్నాయని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పడంతో గద్దల ప్రస్తావన వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రులిద్దరూ అప్రజాస్వామికంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 11మంది ఎమ్మెల్యేలను ప్రోత్సహించి టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారన్నారు.

అదే విధంగా ఏపీలో చంద్రబాబు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని టీడీపీలో చేర్చుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రాతినిధ్యం కోసం చంద్రబాబు పాకులాడుతున్నాడని విమర్శించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూస్తే అనైతిక రాజకీయాలు, అప్రజాస్వామిక పాలన బట్టబయలైందన్నారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్ చూస్తున్నాడని పేర్కొన్నారు. మొత్తానికి రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులను గుత్తా ఏకంగా గద్దలతో పోల్చారు. మరి గతంలో కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నేతలను రాబందులతో పోల్చారు. ప్రస్తుతానికి అయితే లెక్క సరినపోయింది. అయితే ఇలా రాజకీయాల్లోకి గద్దలను, రాబందులను లాగడం ఏం బాగోలేదని కొందరు అంటున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gutta sukhender reddy  Gutha  Eagles  KCR  Chandrababu  

Other Articles