Modi, Google, criminals, Search, Dawood, lakhwi

Pm modi showed as top criminal in india by google search

Modi, Google, criminals, Search, Dawood, lakhwi

Pm modi showed as top criminal in india by google search. Modi image placed between the Dawod, Lakhwi and some most wanted criminals.

నరేంద్ర మోదీ క్రిమినలా..?

Posted: 06/04/2015 08:07 AM IST
Pm modi showed as top criminal in india by google search

ప్రధాని నరేంద్రమోదీ క్రిమినల్ గా మారారు. అవును అది కూడా మామూలు క్రిమినల్ కాదు టాప్ క్రిమినల్స్  లిస్ట్ లో చేరిపోయారు. అవును దావూద్, అబ్బాస్ నఖ్వీ లాంటి కరడుకట్టిన క్రిమినల్స్ పక్కన ప్రధాని నరేంద్ర మోదీ చేరిపోయారు. ఏంటీ ఇదంతా అనుకుంటున్నారా..? గూగుల్ సెర్చింజన్ లో టాప్ క్రిమినల్స్ ఇన్ ఇండియా అని సెర్చ్ చేస్తే ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోలు కనిపించడం సర్వత్రా చర్చకు దారితీసింది. అయితే అనుకోకుండా, టెక్నికల్ ప్రాబ్లమ్ వల్లే అలా వచ్చిందని గూగుల్ వివరణ ఇచ్చుకుంది. సంస్థ జరిగిన తప్పుకు క్షమాపణ చెప్పింది. అయితే ఇది అనుకోకుండా జరిగిందా లేదా కావాలనే చేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

modi-placed-in--top-crimina

గూగుల్‌ సెర్చ్‌లో క్రిమినల్స్ జాబితాలో ప్రధాని మోడీ పేరు ఉంది. ప్రపంచంలో కెల్లా టాప్‌-10 క్రిమిన ల్స్‌ కోసం గూగుల్ సెర్చ్ లో వెదికితే ప్రధాని మోడీ పేరు ఉంది. ప్రపంచంలోనే కరడుగట్టిన నేరస్థుల తొలి మంది జాబితాలో ప్రధాని ఫొటో ఉండటం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈ అంశం కలకలం సృష్టించింది. గూగుల్ సెర్చ్ బాధ్యతారాహిత్యాన్ని విమర్శిస్తూ పలువురు ట్వీట్ చేశారు. గూగుల్ సెర్చ్ లో టాప్ టెన్ క్రిమినల్స్ లో కరుడుగట్టిన ఉగ్రవాదులు ఒసామాబిన్‌ లాడెన్‌, దావూద్‌ ఇబ్రహిం, హఫీజ్‌ సయీద్‌, అమెరికా సీరియల్‌ కిల్లర్‌ ఎరియల్‌ కాస్ట్రోలతోపాటు బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ కూడా ఉన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Google  criminals  Search  Dawood  lakhwi  

Other Articles