After Manmohan, HD Deve Gowda Meets PM Narendra Modi

Hd deve gowda meets pm narendra modi

HD Deve Gowda, PM Modi, Modi meets Deve Gowda, narendra modi, hd devegowda, 7 race course road, Former prime minister HD Deve Gowda, New Delhi, Prime Minister Narendra Modi

Former prime minister HD Deve Gowda called on Prime Minister Narendra Modi at his official residence in New Delhi today, an official statement said.

ప్రధాని మోడీతో భేటీ అయిన మాజీ ప్రధానమంత్రి

Posted: 06/03/2015 10:39 PM IST
Hd deve gowda meets pm narendra modi

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. తన ఏడాది పాలన పూర్తైన క్రమంలో ఆయన మాజీ ప్రధాన మంత్రులను మర్యాదపూర్వకంగా తన అధికార నివాసానికి రప్పించి.. వారితో ముచ్చటించారు. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను ఆహ్వానించినప్పుడే దేవెగౌడను కూడా ప్రధాని నరేంద్ర మోదీ తన అధికార నివాసానికి ఆహ్వానించారు. అయితే అప్పట్లో బెంగళూరులో వేరే కార్యక్రమాల్లో ఉన్నందువల్ల దేవెగౌడ ఢిల్లీ రాలేకపోతున్నట్లు చెప్పారు.

తర్వాత ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు రావాలని దేవెగౌడకు సమాచారం అందించారు. దాంతో ఇప్పుడు.. బుధవారం నాడు ఆయన ఢిల్లీ వచ్చి, నెం.7 రేస్కోర్సు రోడ్డులోని ప్రధాని అధికారిక నివాసానికి వచ్చి మోదీని కలిసి ఆయనతో కొద్దిసేపు సమావేశమయ్యారు. తెల్లటి లాల్చీ, తెల్లటి పంచె, తెల్లటి పైపంచ ధరించి వచ్చిన దేవెగౌడకు.. ప్రధాని నరేంద్రమోదీ కూడా తెల్లటి లాల్చీ పైజమా ధరించి స్వాగతం పలికారు. అయితే మన్మోహన్ సింగ్ ను తన నివాసానికి పిలుపించుకుని ప్రధాని మోడీ ఆర్థిక పాఠాలు నేర్చుకున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : HD Deve Gowda  PM Modi  Modi meets Deve Gowda  

Other Articles