Tdp to complain to election commission on telangana mlc elections | chandrababu

Chandrababu to complain to election commission on telangana mlc elections

chandrababu to complain to election commission on telangana mlc elections, Andhra pradesh chief minister chandrababu, TDP national president chandrababu, election commission, telangana mlc elections

Andhra pradesh chief minister, TDP national president chandrababu to complain to election commission on telangana mlc elections

టీఆర్ఎస్ దొంగాటను ఎన్నికల కమీషన్ కు పిర్యాదు చేస్తాం.

Posted: 06/03/2015 08:50 PM IST
Chandrababu to complain to election commission on telangana mlc elections

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటుకు నోటు కేసులో తమ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టైయిన మూడు రోజులు తరువాత ఈ విషయమై స్పందించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల విషయమై తమ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల సంఘాన్ని కలుస్తామని ఆయన  తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దొంగాట ఆడిందని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిందని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి వున్న బలంతో కేవలం నలుగురు ఎమ్మెల్సీలు మాత్రమే గెలుపొందుతారని, ఈ క్రమంలో తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కొనుగోలు చేసిందని అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ విధానం మార్చాలన్నారు. దామాషా పద్ధతిలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ కావాలనే ఇబ్బందులు సృష్టిస్తోందన్నారు. తెలంగాణలో తమ పార్టీని టీఆర్ఎస్ టార్గెట్ చేసి.. తమ ఎమ్మెల్యేలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఓటుకు నోటు కేసులో తనను విమర్శించే అర్హత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. వైఎస్ జగన్ ఎందుకు దీక్ష చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని గొట్లూరు గ్రామంలో 'జన్మభూమి-మాఊరు' కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  telangana mlc elections  

Other Articles