'Madras Cafe' actress Leena Maria Paul held in fraud case

Bollywood heroine leena maria paul turns villian in real life cheating for rs 10 crore

Leena Paul,Actor Leena Paul, Leena Maria Paul, Leena Maria Paul Arrested, Actor Leena Paul Arrested for Cheating, Sekhar Chandrashekhar, Investment Fraud, Mumbai Police, Mumbai Police Crime Branch, bollywood heroine, leena maria paul, madras cafe, rakhi sawant

The economic offences wing of the Mumbai Police crime branch has arrested actor Leena Paul and her partner Sekhar Chandrashekhar in an alleged case of cheating

బాలీవుడ్ హీరోయినే.. కానీ ఇలా మోసం చేసి.. విలన్ అయ్యింది..

Posted: 06/03/2015 08:58 PM IST
Bollywood heroine leena maria paul turns villian in real life cheating for rs 10 crore

బాయ్ ఫ్రెండుతో కలిసి జల్సాలకు మరిగిన సినీమా మాయలేడి.. ప్రజలను నెత్తిన కుచ్చుటోపి పెట్టేందుకు సిద్దం కావడంతో ముంబైకి చెందిన సినీ నటి లీనా మరియా పాల్ ని పోలీసులు అరెస్టు చేసారు. తన బాయ్‌ఫ్రెండ్ శేఖర్ చంద్రశేఖర్ తో కలిసి అమ్మడు ఈ మోసాలకు పాల్పడింది. వేలాది మంది నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడ్డట్లు వెల్లడింది. చిన్న సినిమాల్లో హీరోయిన్గా చేస్తూ.. దాదాపు వెయ్యిమందిని కోట్లాది రూపాయల మేర మోసగించిన లీనా మరియా పాల్ 2009లో వచ్చిన మోహన్ లాల్ మూవీ రెడ్ చిల్లీస్, జాన్ అబ్రహం నటించిన ‘మద్రాస్ కేఫ్' చిత్రాల్లో నటించింది. ఆమె బాధితుల జాబితాలో ఐటెం బాంబ్ రాఖీ సావంత్ కూడా ఒకరు కావడం గమనార్హం.

తన బాయ్ ఫ్రెండ్ సహా మరికొందరితో కలిసి దాదాపు వెయ్యిమందికి టోపీ పెట్టి 9 లగ్జరీ కార్లు, 117 ఇంపోర్టెడ్ వాచీలు, ఒక స్పోర్ట్స్ బైకు, 12 సెల్ఫోన్లు, ఇంకా అనేక విలాసవంతమైన వస్తువులు సొంతం చేసుకున్నారు. దాంతో ముంబై క్రైం బ్రాంచి ఆర్థిక నేరాల విభాగం పోలీసులు వాళ్లను, వాళ్లతో పాటు అదిల్ జైపురి (24) అఖ్తర్ జైపురి (55), సల్మాన్ రిజ్వీ (28), నజీర్ జైపురి (50) అనే నలుగురిని కూడా అరెస్టు చేశారు. ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ పెడతాం, మీ పెట్టుబడిని రెండింతలు చేస్తాం అంటూ వీరు చెప్పిన మ వెయ్యి మందికి పైగా కోట్లాది రూపాయలు వీరి వద్ద ఇన్వెస్ట్ చేసారు. అయితే వారు కంపెనీ మొదలు పెట్టకుండా ఆ డబ్బుతో జల్సా జీవితం గడపడం మొదలు పెట్టారు. ఆ డబ్బుతో వారు ఇప్పటి వరకు 9 లగ్జరీ కార్లు, 117 ఇంపోర్టెడ్ గడియారాలు, ఓ స్పోర్ట్స్ బైక్, 12 సెల్ ఫోన్లు, మరికొన్ని ఖరీదైన వస్తువులు కొన్నారు.

ముంబైలోని ఎకనమిక్ అఫెన్స్ వింగ్ వీరి మోసాన్ని పసిగట్టింది. ఈ మొత్తం మోసాలకు మాస్టర్ మైండ్ చంద్రశేఖర్ అని ఎకనమిక్ అఫెన్స్ వింగ్ ఆఫీసర్లు గుర్తించారు. గుర్‌గావ్‌లో ‘లయన్ ఓక్ ఇండియా' పేరుతో ఓ కార్యాయలం ఓపెన్ చేసిన వీరు...నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరిస్తున్నారు. ఇందులో లక్కీ నెంబర్ 05, స్పెషల్ హార్వెస్ట్ వీక్, సూపర్ హార్వెస్ట్ ప్లస్, వీక్లీ న్యూఇయర్ బొనాంజ పేరుతో పలు స్కీములు నడుపుతున్నారు. రూ. 10 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది.  అంతేకాదు, చంద్రశేఖర్ తనను తాను ఐఏఎస్ అధికారిగా చెప్పుకొని, ఓ బ్యాంకు నుంచి రూ. 19 కోట్ల రుణం కూడా తీసుకున్నాడు. అయితే కొందరికి డబ్బులు తిరిగి ఇవ్వక పోవడంతో విషయం బయటకు పొక్కింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bollywood heroine  leena maria paul  madras cafe  rakhi sawant  

Other Articles