revanth reddy, Hospital, Pains, Arrest, Judge, Osmania hospitalevanth reddy, Hospital, Pains, Arrest, Judge, Osmania hospital

Revanth reddy told to judge that he is sufering from several body pains

revanth reddy, Hospital, Pains, Arrest, Judge, Osmania hospital

Revanth Reddy told to Judge that he is sufering from several body pains. After revanth Reddy arrest, the acb officals produce him at Judge.

రేవంత్ రెడ్డి డ్రామాలోనూ హాస్పిటల్ సీన్..?

Posted: 06/01/2015 10:57 AM IST
Revanth reddy told to judge that he is sufering from several body pains

చాలా తెలుగు సినిమాల్లోనూ చూసే సీన్. ఎవరినైనా అరెస్టు చేస్తే చాలు ఏదో ఆరోగ్యం బాగులేదు అంటూ హాస్పిటల్ లో జాయిన్ కావడం తర్వాత హాస్పిటల్ నుండే మొత్తం కథను మలుపుతిప్పడం. ఇలా కేవలం సినిమాల్లోనే కాదు నిజజీవితాల్లోనూ జరుగుతుంటాయి. అయితే మామూలు వ్యక్తుల్లో కాకుండా రాజకీయ నాయకులుల ఇట్లాంటి డ్రామాలు బాగా ఆడుతారు. తాజాగా ఏసీబి వలకు వచ్చిన రేవంత్ రెడ్డి కూడా సేమ్ సీన్ జడ్జి ముందు విన్నవించారు. అయ్యా పోలీసులు నాతో ర్యాష్ గా బిహేవ్ చేశారు, నా భుజానికి, చేతులకు గాయాలయ్యాయి. అంతే కాకుండా గత కొంత కాలంగా ఒళ్లు నొప్పులు ఉన్నాయి... కాబట్టి హాస్పిటల్ చూపించుకునే అవకాశం కల్పించాలని కోరారు. దానికి సమ్మతించిన జడ్జ్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారని ఆదేశించారు. అయితే మామూలుగా ఇట్లాంటి సీన్లు సినిమాల్లో  రావడం చాలా మామూలు. కానీ సినిమా టెక్నిక్ లను బాగా వంటపట్టించుకున్న రాజకీయ నాయకులు వాటిని బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ నిజంగా రేవంత్ రెడ్డికి ఆరోగ్యం బాగోలేదా..? లేదా కావాలనే ఇలా డ్రామాలాడుతున్నారా..? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొంత మంది విమర్శకులు. అయినా ప్రతిసారీ ఈ హాస్పిటల్ సీన్ మాత్రం తప్పడం లేదు అనుకుంటున్నారు మామూలు జనం. అయినా రాజకీయ సినిమాలో ఆ మాత్రం హాస్పిటల్ సీన్ లేకపోతే మీడియాకు వార్తలుండవు, రాజకియ సినిమాకు హైప్ రాదని కూడా కొంత మంది అనుకుంటున్నారు. మొత్తానికి హాస్పిటల్ సీన్ కంటిన్యు అవుతోంది.. సినిమాల్లో అయినా.. రాజకీయాల్లో అయినా..

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  Hospital  Pains  Arrest  Judge  Osmania hospital  

Other Articles