Telagana, Revanth reddy, acb, challenges, KCR,

Telangana tdp leader revanth reddy challenges cm kcr after his arrest revanth reddy warn telangana cm kcr

Telagana, Revanth reddy, acb, challenges, KCR,

Telangana TDP leader revanth Reddy challenges Cm kcr after his arrest. Revanth Reddy warn Telangana cm kcr.

ITEMVIDEOS: మీసం మెలేసిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కు వార్నింగ్

Posted: 06/01/2015 10:37 AM IST
Telangana tdp leader revanth reddy challenges cm kcr after his arrest revanth reddy warn telangana cm kcr

ఎమ్మెల్యేకు యాభై లక్షల రూపాయలు ఇవ్వచూపిన కేసులో ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత మీడియా ముందు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. మీస మెలేసి కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కుర్చీలోంచి దించుతా. ఆయన పరిపాలనలో ఏవైతే అక్రమంగా ఆస్తులను అనుయాయులకు కట్టబెట్టిండో వాటిపై కేసులు కట్టిస్తా. ఈ రోజు నాపై ప్రయోగించిన పోలీసులతోనే వారిని ఈడ్చుకొచ్చి లోపలేపిస్తా. వీటన్నింటినీ రాజకీయంగా ఎదుర్కొంటా. నాకు మనోస్థైర్యం ఉంది. నా వెనుక పార్టీ ఉంది. కార్యకర్తలు, అభిమానుల అండ ఉంది... అన్నారు

మిత్రుడు ఏదో సమస్య చెప్పుకుంటా రండి.. అంటే  వచ్చా. నాలుగు గంటలకు చంద్రబాబును కలవాల్సి ఉంది. కానీ అంతకంటే ముందే ఇక్కడికి వచ్చినా.. ఇక్కడికి వచ్చినాక ఇది జరిగింది. సీఎం కేసీఆర్ శాసనమండలి సీట్లు గెలవాలనే కోరికతోనో లేదా తెలుగుదేశం పార్టీని, రేవంత్‌రెడ్డిని ఎదుర్కొలేక గతంలో ఏవైతే అక్రమ కేసులు పెట్టాడో అందులో భాగంగా ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నాడు. రాబోయే 25 సంవత్సరాల్లో ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చంద్రశేఖర్‌రావుపై పోరాడతా. ఈ రోజు ఏదైతే జరుగుతుందో ఇది రేవంత్‌రెడ్డి తెలుగుదేశం వర్సెస్ కేసీఆర్ టీఆర్‌ఎస్. అక్రమ కేసులు ఎన్ని పెట్టినా నైతిక స్థైర్యం కోల్పోను. ధైర్యంగా నిలబడతా’ అని రేవంత్  వెల్లడించారు

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telagana  Revanth reddy  acb  challenges  KCR  

Other Articles