revanth Reddy | assembly | voting | Chanchalguda | acb

Revanth reddy political strategy in assembly premises

revanth Reddy, assembly, voting, Chanchalguda, acb,

Revanth Reddy political strategy in assembly premises. TDP Leader revanth Reddy time pass at asembly and revanth reddy lawyers went to court for his bail.

రాజకీయం అంటే రేవంత్ రెడ్డి.. రేవంత్ అంటే రాజకీయం

Posted: 06/01/2015 11:43 AM IST
Revanth reddy political strategy in assembly premises

అబ్బో.. అబ్బో.. అబ్బబ్బో అంటూ ఎంత పొగిడినా తనివి తీరని అపర రాజకీయం రేవంత్ రెడ్డి సొంతం. అదేంటి రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు కదా..? మరి అలాంటప్పుడు రాజకీయం ఎక్కడి నుండి చేస్తున్నాడు..? ఎలా చేస్తున్నాడు..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయా..? అన్నింటికి ఒకటే సమాధానం. అదే తెలంగాణ అసెంబ్లీ. అవును తెలంగా అసెంబ్లీ ఆవరణలోనే ప్రస్తుతం కనీవినీ ఎరుగని రీతిలో రాజకీయ సినిమా నడుస్తోంది. టికెట్టు తీసుకున్న సినిమా అయినా బోర్ కొడుతుందో తెలియదు కానీ రాజకీయ సినిమా మాత్రం అస్సలు బోర్ కొట్టడం లేదు. తాజాగా రేవంత్ రెడ్డి అరెస్ట్, తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టడం ఆ తర్వాత ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించడం టకటకా జరిగిపోయాయి. అయితే అలా ఓటు హక్కు వేసే అవకాశం రావడంతోనే కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. అసలు అక్కడ ఏం సినిమా స్టార్ట్ అయిందో తెలుసా..

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగిచుకునేందుకు వీలు కల్పిస్తు జడ్జి గారు తీర్పునిచ్చారు. అయితే అలా అసెంబ్లీ ఆవరణకు చేరుకున్న రేవంత్ రెడ్డి.. అందరిని పలకరించారు. అక్కడ ఓటు వేస్తే వెంటనే జైలుకు తరలిస్తారు అన్న అనుమానంతో రేవంత్ రెడ్డి ఎంతకీ ఓటు హక్కును వినియోగించుకోలేదు. టైం పాస్ చేస్తూ అసెంబ్లీలో కలియతిరిగారు రేవంత్ రెడ్డి. అంతలోనే రేవంత్ రెడ్డి తరఫున లాయర్లు కోర్టులో రేవంత్ రెడ్డికి బెయిల్ పిటిషన్ వేశారు. దాదాపు 3గంటల సమయంలో బెయిల్ మీద హియరింగ్ ఉంటుందని సమాచారం. దాంతో దాదాపు మధ్యాహ్నం వరకు ఓటు వెయ్యకుండా ఉండడానికి ట్రైచేశారు. కానీ ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డి మీద తీవ్రంగా వత్తిడి తీసుకురావడంతో చివరకు ఓటు వేశారు. ఓటు వేసిన వెంటనే రేవంత్ రెడ్డిని హడావిడిగా చంచల్ గూడ జైలుకు తరలించారు ఏసీబీ అధికారులు. అయినా బహుశా చంద్రబాబు దగ్గర ఈ రాజకీయ చతురతను నేర్చుకొని ఉంటారని అందరు అనుకుంటున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth Reddy  assembly  voting  Chanchalguda  acb  

Other Articles