woman gang raped in kolkata hospital

Minor girl raped by electric sub station operator

minor girl raped by electric sub station operator, woman gang raped in kolkata hospital, minor girl, rape, power substation, pulkal mandal, Woman, gang rape, Kolkata hospital, crime against women, violence against women, harrassment against women

minor girl raped by electric sub station operator in Telangana medak district, and woman gangraped in kolkata hospital

తెలంగాణలో బాలికపై, కోల్ కత్తాలో మహిళపై అత్యాచారం..

Posted: 05/31/2015 09:48 PM IST
Minor girl raped by electric sub station operator

ప్రభుత్వాలు, పాలకులు చెబుతున్న మాటలన్నీ అబల పరిరక్షణ విషయంలో నీటి మూటలుగానే మిగులుతున్నాయి. తెలంగానలో ఓ కామాంధుడు ముక్కుపచ్చలారని బాలికను విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నిర్బంధించి రెండు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లా పుల్‌కల్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పుల్‌కల్‌లోని స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్న తోఫిక్(24) శుక్రవారం సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన 12 ఏళ్ల బాలికను బైక్‌పై సబ్‌స్టేషన్‌కు తీసుకొచ్చి నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేశాడు. శనివారం ఆమెను విడిచిపెట్టాడు. అక్కడి నుంచి పోతిరెడ్డిపల్లిలోని తన ఇంటికి చేరుకున్న బాలికను తల్లిదండ్రులు ప్రశ్నించడంతో ఆమె విషయం చెప్పింది. దీంతో బాలికను తీసుకుని తల్లిదండ్రులు రాత్రి 11 గంటలకు పుల్‌కల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం ఉదయం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితురాలికి వైద్య పరీక్షలు జరిపించారు. కాగా నిందితుడు పరారీలో ఉన్నాడు.

బంధువును పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళపై ఇద్దరు ఉద్యోగులు లైంగికదాడికి పాల్పడ్డారు. కోల్కతాలోని ఓ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. పశ్చిమబెంగాల్లోని ముషీరాబాద్ జిల్లాకు చెందిన ఓ యువతి శుక్రవారం కోల్కతా వచ్చింది. తన బంధువును పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లింది. ఈ రోజు రాత్రి ఆస్పత్రిలో పనిచేసే లిఫ్ట్మన్, మరో ఉద్యోగి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులు మసూమ్ అలీ ఖాన్, హైదర్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో ఆస్పత్రిలో పనిచేసే మహిళా సిబ్బంది,  మహిళా రోగులు భయపడుతున్నారు. మహిళలకు భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : minor girl  rape  power substation  pulkal mandal  Woman  gang rape  Kolkata hospital  

Other Articles