PMO busts Rahul Gandhi's 'paathshala' jibe, says Manmohan visit was part of invite

Courtesy call or invitation after pm modi manmohan singh meet different versions

PMO busts Rahul Gandhi's 'paathshala' jibe, says Manmohan visit was part of invite, Rahul Gandhi, PMO, 'paathshala' jibe, Narendra Modi, Manmohan Singh, Narendra Modi, PM Modi, former Pm Manmohan Singh, PM Modi meets Manmohan Singh, 7 Race Course Road, Amit Shah, BJP, modi manmohan meet, narendra modi, courtesy meet, devegowda, pmo

In a major embarrassment for Rahul Gandhi, the prime minister's office busted the Congress vice president's 'paathshaala' quip over Manmohan Singh's meet with PM Narendra Modi, saying it was part of an invite extended to all former PMs.

రాహుల్ తెలుసుకో.. మర్యాద కోసమే ఆహ్వానించాం..

Posted: 05/29/2015 10:38 PM IST
Courtesy call or invitation after pm modi manmohan singh meet different versions

ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను కలవడం కేవలం మర్యాదపూర్వకమేనని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించిన ఒకరోజు తర్వాత పీఎంఓ నుంచి ఈ ప్రకటన వచ్చింది. మాజీ ప్రధానమంత్రులు చాలామందిని ఈ భేటీకి పిలిచామని పీఎంఓ అధికారులు తెలిపారు. మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడకు కూడా ఆహ్వానం వెల్లిందని, అయితే ఆయన బెంగళూరులో ఓ సమావేశానికి హాజరు కావాల్సి ఉండటంతో రాలేకపోతున్నట్లు చెప్పారని అన్నారు.

దాంతో ప్రధాని ముఖ్యకార్యదర్శి నృపేంద్ర మిశ్రా స్వయంగా దేవెగౌడకు ఫోన్ చేసి.. ఆయనకు ఖాళీ ఉన్నప్పుడు మోదీని కలవాల్సిందిగా ఆహ్వానించారు.  ఏడాది పాలన పూర్తయిన ఒకరోజు తర్వాత.. మే 27న ప్రధాని నరేంద్రమోదీ తన అధికారిక నివాసం నెం.7 రేస్కోర్సు రోడ్డు నివాసంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను కలిసిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ విమర్శించడం.. దాన్ని బీజేపీ శ్రేణులు కూడా తిప్పికొట్టడం వెంటవెంటనే జరిగిపోయాయి.


జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi manmohan meet  narendra modi  courtesy meet  devegowda  pmo  

Other Articles