trs shocked at election commission decision

Congress party mp rapolu ananda bhaskar takes on trs leaders

trs shocked at election commission decision, congress Rajya sabha mp rapolu ananda bhasker, mp rapolu ananda bhasker complaints to election commission, Rapolu Ananda Bhaskar, Congress party mp, TRS leaders, mlc elections, trs, MLC elections, CEC

election commission takes congress Rajya sabha mp rapolu ananda bhasker complaint into consideration and decided to conduct mlc elections in open balllot

కాంగ్రెస్ ఫిర్యాదుతో.. సీఈసీ ఓపెన్ బ్యాలెట్ ఓటింగ్ నిర్ణయం

Posted: 05/29/2015 10:36 PM IST
Congress party mp rapolu ananda bhaskar takes on trs leaders

ఎమ్మెల్యే కోటాలో జరుగనున్నఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. ఓపెన్ బ్యాలెట్ విధానాన్ని నిర్వహించాలని సీఈసీ నిర్ణయం తీసుకోవడంతో టీఆర్ఎస్ డైలామాలో పడింది. ఐదుగురు అభ్యర్థులను ఎమ్మెల్సీ ఎన్నికల పోరుకు టీఆర్ఎస్ సిద్ధం చేసిన నేపథ్యంలో ఓపెన్ బ్యాలెట్ ఎన్నిక విధానం చేటు తెచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను సొంత పార్టీ బలంతోనే గెలిచే అవకాశం ఉన్న టీఆర్ఎస్.. ఐదో అభ్యర్థికి మాత్రం కచ్చితంగా వేరే పార్టీల మద్దతు తీసుకోవాలి. ఆ క్రమంలోనే సీక్రెట్ బ్యాలెట్ విధానమైతే బాగుంటుందని టీఆర్ఎస్ భావించింది.

తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అప్రజాస్వామిక విధానానికి పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్భాస్కర్.. న్యూఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)ను కలసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించాలని ఆయన ఎన్నికల కమీషన్ ను కోరారు. రాపోలు పిర్యాదును పరిగణలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఓపెన్ బ్యాటెల్ విధానం ద్వారనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం టీఆర్ఎస్ పార్టీలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఓపెన్ బ్యాలెట్ విధానంలో ఎమ్మెల్సీలకు వేసే ఓటు బహిర్గతం కానుండటంతో  ఎమ్మెల్యేలు ఎటువంటి రిస్క్ తీసుకునే ఆస్కారం ఉండదు. ఒకవేళ పార్టీ నిర్ణయాన్ని ఉల్లంఘించి ఓటేయాలనుకుంటే ఎమ్మెల్యే పదవి కోల్పోయే ప్రమాదం పోంచి ఉంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trs  MLC elections  CEC  

Other Articles