Teenage girl abducted | Gangraped | killed | Telangana | auto drivers |

Teenage girl abducted gangraped killed in telangana

Teenage girl abducted in Telangana, Teenage girl Gangrape in Telangana, Teenage girl killed in Telangana, Telangana, crime in Telangana, violence against woman, crime against woman, Teenage girl abducted, killed in Telangana, news, India news, crime in rangareddy, Ranga Reddy District Superintendent of Police M Srinivas, Bantaram Police Station Sub-Inspector Ravinder,

A 15-year-old girl student was allegedly abducted and killed by unidentified persons in Ranga Reddy district of Telangana, police said today.

తండ్రిని కోట్టి, బాలికను ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్.. మర్డర్

Posted: 05/22/2015 10:36 PM IST
Teenage girl abducted gangraped killed in telangana

రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తండ్రితో కలసి బయటకు వెళ్తున్నానని ధైర్యంగా, సంతోషంగా వెళ్లని ఆ చిన్నారికి తెలియదు అదే అమెకు చివరి రోజు అవుతుంది. తన చిన్నారి కోరిక మేరకు దాహం తీర్చుకునేందుకు ఆటోను నిలిపిన ఆ కన్న తండ్రికి తెలియదు అదే అమె పాలిట తులసి తీర్ధం అవుతుంది. తన ఎదుటే తన చిన్నారిని రాబంధులు ఎత్తుకుని వెళ్తుంటే.. ఏం చేయలేని అసహాయ స్థితిలోకి జారుకున్న తండ్రి పడిన మనో వేదన చెప్పనలవి కాదు. తన తండ్రి నుంచి రాబందుల చేతుల్లోకి పడిన ఆ చిన్నారికి ఊహించని పరిణామే ఎదురైంది.

తమ కామవాంఛ తీర్చుకునేందుకు ఐదుగురు మానవ మృగాలు చిన్నారిపై విరుచుకుపడి అత్యంత పైశాచికంగా కబళించివేసాయి. అంతేకాదు అమెపై దాడి చేసి మరీ హతమార్చాయి. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ తెలంగాణ ప్రాంతంలో బంట్వారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం గురువారం సాయంత్రం బాలిక తన తండ్రితో కలిసి వికారాబాద్ నుంచి తన సొంత గ్రామం ఇజ్రాచిట్టంపల్లి ఆటోలో వెళుతుండగా మధ్యలో అడ్డుకున్న నలుగురు వ్యక్తులు తండ్రిపై దాడి చేసి తొమ్మిదవ తరగతి చదువుతున్న చిన్నారిని ఎత్తుకెళ్లిపోయారు.

అనంతరం ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పాశవిక లైంగిక దాడి జరిపి అనంతరం ఆమె ప్రాణాలు చిదిమేశారు. తండ్రి ఫిర్యాదు చేయడంతో గాలింపులు జరిపిన పోలీసులు శుక్రవారం బాలిక మృతదేహాన్ని అక్కడి నుంచి ఓ కిలోమీటరు దూరంలో గుర్తించారు. ఈ ఘటన జరగడానికి ఆటో డ్రైవర్ ప్రమేయం ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను అరెస్టు చేసేందుకు ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపామని రంగారెడ్డి జిల్లా ఎస్పీ ఎం శ్రనివాస్ తెలిపారు. కాగా ప్రస్తుతం కిడ్నాప్, మర్డర్, సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, వీటితో పాటు సిఒసిఎస్ఒ చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు బంట్వారం ఎస్ ఐ రవిందర్ తెలిపారు. పోస్టుమార్టమ్ రిపోర్టు ఆధారంగా సెక్షన్లను పోందుపరుస్తామని చెప్పారు.
.
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  crime news  girl abducted and killed  gang rape  

Other Articles