Two Gujarat cops dance with a woman, shower money while on duty

Gujarat cops sleezy dance with orchestra girls

vadodara police, gujarat police, police dancing, gujarat police dancing, cop dancing, vododara police dancing, gujarat police dance viral video, gujarat news, vadodara news, india news, national news, bar girls, breaking news, constables, cops, dance, exclusive, gujarat, india, news, orchestra, police, sleezy, social media, vadodara, video, viral

A video showing two police constables shaking their legs with female orchestra dancers in Vadodara, Gujarat, has gone viral on social media. The two policemen are seen on a stage dancing to Bollywood numbers with girls and showering money while in uniform.

ITEMVIDEOS: తప్పతాగి చిందేసిన గుజారాత్ పోలీసులు

Posted: 05/22/2015 10:35 PM IST
Gujarat cops sleezy dance with orchestra girls

తాము పోలీసులమని మరిచారు. కాదు కాదు పోలీసులం మాకేంటి అడ్డు అనుకున్నారు. లేక అంతా మనవాళ్లే అనుకున్నారో.. కనీసం తమ దుస్తులకు కూడా విలువ నీయకుండా విమర్శలపాలయ్యారు. గుజరాత్లో ఇద్దరు పోలీసులు బాధ్యత విస్మరించారు. తప్పతాగి అమ్మాయితో కలసి పబ్లిక్గా రికార్డు డ్యాన్స్లు వేశారు. ఈ వీడియో బయటకు తెలిసి పోలీసు కమిషనర్ ప్రత్యేక విచారణ కమిటీ వేశారు. వడోదర జిల్లాలోని కిషన్ వాడి పోలస్ స్టేషన్కు చెందిన ఇద్దరు పోలీసులు ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లారు. అనంతరం ఫుల్లుగా తాగడమే కాకుండా అక్కడే స్టేజీమీదకు డ్యూటీ డ్రెస్లో వెళ్లి చిందులేస్తూ అమ్మాయిపై డబ్బులు ఎగజల్లుతూ మత్తులో తూలిపోయారు. పది రోజులకింద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరు చేసిన బాగోతమంతా 2.12 నిమిషాల నిడివితో ఉన్న వీడియోలో రికార్డయి ఉంది.

ఈ వీడియో ప్రకారం ఓ హిందీ పాట వస్తుండగా అక్కడ డ్యాన్స్ వేస్తున్న అమ్మాయి చేయిపట్టుకుని ఓ పోలీసు ఎగరడం.. అక్కడే ఉన్న మరో పోలీసు చేతిలోకి డబ్బులు తీసుకొని ఆమెకు చూపిస్తూ ఒక్కొక్కటిగా ఆమెపై వేయడం చేశారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి మొత్తం నోట్లు ఆమెపై కుమ్మరించారు. అయితే, ఈ వివాహ కార్యక్రమానికి హాజరైనవారిలో ఒకరు ఈ వీడియోను రికార్డు చేయడంతో అది ఆ ఫోన్కు ఈ ఫోన్కు చేరి చివరకు బయటకు పొక్కడంతో వీరి బాగోతం కాస్త బయటపడింది. కాగా, వారు హాజరైన వివాహ వేడుక కూడా పోలీసు కూతురుదే కావడం కొసమెరుఃపు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cops dancing  woman  gujarat  inquiry  

Other Articles