land acquisition act implimentation breaks in andrapradesh

High court stays implementation of 166 go a big blow to ap government

land aquisition, go no. 166, ap government, capital city, ap high court, narayana, Land Pooling, andhrapradesh government, amaravathi, state capital, minister narayana,

andhrapradesh government gets a big blow as high court stays implementation of 166 go

నవ్యాంధ్ర సర్కార్ కు కోర్టులో ఎదురుదెబ్బ..

Posted: 05/21/2015 09:26 PM IST
High court stays implementation of 166 go a big blow to ap government

నవ్యాంధ్ర సర్కార్ కు కోర్టులో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని ప్రాంత భూసేకరణ కోసం ప్రభుత్వం జారీచేసిన 166 జీవోపై రెండు వారాల పాటు స్టే ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక ప్రభావ అంచనాను విస్మరించారని, అందువల్ల ఈ జీవో అమలును రెండు వారాల పాటు నిలిపివేస్తున్నామని కోర్టు తెలిపింది. ల్యాండ్ పూలింగ్ సాధ్యం కాకపోవడంతో భూసేకరణ చట్టాన్ని ప్రయోగించాలని ఈనెల 18న చంద్రబాబు సర్కారు ఈ జీవో జారీచేసింది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు హైకోర్టులో విచారణకు రాగా ప్రముఖ న్యాయవాది రవిశంకర్ పిటిషనర్ల తరఫున వాదించారు. ఆ వాదనతో ఏకీభవించిన కోర్టు.. జీవో నెం. 166 అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

కాగా, భూసేకరణ చట్టాన్ని రాజధానిలో ప్రస్తుతం అమలు చేయడం లేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పామని, 15 రోజుల తర్వాత అఫిడవిట్ దాఖలు చేయమని కోర్టు కోరిందని చెప్పారు. అంతవరకూ ల్యాండ్ పూలింగ్ మాత్రమే నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు 16,500 ఎకరాలు రైతుల నుంచి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రాజధాని డిజైన్లొ మార్పులున చేస్తున్నారని, 29 గ్రామాల్లో భూములచ్చిన రైతులకు అదే గ్రామంలో అభివృద్ధి చెందిన భూమి ఇస్తామని మంత్రి తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : land aquisition  ap high court  narayana  Land Pooling  

Other Articles