Why this 10-yr-old girl says Modi is an angel?

8 year old writes to modi gets immediate help for her heart problem

Narendra modi, prime minister, taiyaba, agra, muslim girl, heart valve, Agra, financial help, heart treatment, director of health service, Delhi’s GB Pant hospital, Modi Ferishta, Taiyaba, Abdul Khalid, Chand Bi, congenital heart condition

Taiyaba, a resident of Mantola in Agra, suffers from a congenital heart condition and has to undergo a surgery of her heart valve

ప్రధాని ఆ కుటుంబం పాలిట దేవదూతే..

Posted: 05/21/2015 04:04 PM IST
8 year old writes to modi gets immediate help for her heart problem


ఎనిమిదేళ్ల చిన్నారి.. చదివేది మాత్రం మూడో తరగతి. అయినా సరే.. తన చిట్టి బుర్రకు పదును పెట్టి.. చక్కని అలోచనతో తన హృద్రోగ సమస్యను దూరం చేసుకుంది. అంతేకాదు.. తనకు ప్రధాని నరేంద్రమోడీ దేవదూతని పేర్కోంది. అదేంటి..? అనుకుంటున్నారా..? తయ్యాబా అనే చిన్నారి. చక్కగా స్కూల్ కు వెళ్లి చదువుకుంటోంది. ఈ మధ్య తనకు గుండెకు రంద్రం ఉందని తెలిసింది. ఇంట్లో పూటగడవని పరిస్థితి. మంచి బట్టలు ఇచ్చి, పుస్తకాలు కొనిచ్చి పంపే స్తోమత కూడా ఆమె తల్లదండ్రులకు అంతంతమాత్రం. ఆ చిట్టి తల్లికి ఎందుకు ఆ ఆలోచన వచ్చిందో తెలియదు. వెంటనే తాను ఒక లేఖ రాయాలనుకుంది. అది కూడా భారత ప్రధాని నరేంద్రమోదీకి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గుండెజబ్బుతో బాధపడుతున్న తనను కాపాడాలని, చికిత్స చేయించుకునేందుకు ఆర్థికంగా సహాయం చేయాలని వేడుకుంటూ తయ్యాబా ప్రధానికి లేఖ రాసింది. తయ్యాబా తండ్రి చెప్పులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఆమె రాసిన లేఖకు వెంటనే స్పందించిన ప్రధాని కార్యాలయం వెంటనే స్పందించింది. ఆపరేషన్కోసం ఢిల్లీలోని జీబీ పంత్ ఆస్పత్రిలో అన్ని ఏర్పాట్లు చేసింది. పూర్తి ఖర్చులు భరిస్తానని స్పష్టం చేసింది. ఆ లేఖలో పాప ఇలా రాసింది. 'నా హృదయానికి రంద్రం ఉంది. నా ఆపరేషన్ కోసం మా నాన్న దగ్గర డబ్బు లేదు. ప్రధాని అందరికోసం పనిచేస్తారని చెప్పడం టీవీ ద్వారా తెలుసుకున్నాను. నేను బతికేందుకు అర్హురాలిని' అని పేర్కొంది. ఈ లెటర్ పంపించిన కొద్ది రోజులకే అశ్చర్యంగా వారికి కబురు వచ్చింది. ఢిల్లీలోని పంత్ ఆస్పత్రి నుంచి వైద్యశాఖ అధికారులు నేరుగా బాలికను అస్పత్రికి తీసుకురావాలని.. వైద్య ఖర్చులన్నీ ఆసుపత్రే భరిస్తుందంటూ చెప్పారు. వెళ్లి చికిత్స చేయించుకుని తిరిగి ఇంటికి వచ్చిన చిన్నారి తయ్యబా ప్రధానికి కృతజ్ఞతలు తెలుపగా, వారి తల్లిదండ్రులు మాత్రం అమె ప్రధాని తమ పట్ట దేవదూతగా వచ్చి చిన్నారిని హృద్రోగం నుంచి దూరం చేశారని అంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Agra  financial help  heart treatment  Narendra Modi  

Other Articles