Telangana ssc results, 9 years old comes out with flying colours

9 year old aces telangana class 10 with 7 5 gpa

9-year-old aces Telangana Class 10 with 7.5 GPA, Child prodigy Agastya Jaiswal, SSC Board exams, Telangana, Education, 7.5 GPA in the Board exam, Telangana Government, Exceptional case to encourage child prodigies

Child prodigy Agastya Jaiswal created a record by clearing the SSC Board exams at the age of nine. Agastya managed to get a 7.5 GPA in the Boards

అబ్బో బుడతా.. బేష్.. పదేళ్లు నిండకుండానే అరుదైన రికార్డు..

Posted: 05/18/2015 08:58 PM IST
9 year old aces telangana class 10 with 7 5 gpa

అబ్బో బుడతదు. అట్టాంటి ఇట్టాంటి బుడతడు కాదమ్మా...! అదిరిపోయే అరుదైన రికార్డును సోందంత చేసుకున్న బుడతడు. అదేంటనుకుంటున్నారా..? తొమ్మిదేళ్ల ప్రాయంలోనే పదో తరగతి పరీక్షలను రాయడమే కాకుండా ఫలితాలు 75శాతం మార్కులను కూడా సాధించాడు బుడతడు. పిట్ట కోంచె కూత ఘనం అన్న చందంగా ఈ బడుతడి రికార్డును చూసి అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పదో తరగతి బోర్డు పరీక్షలలో ఎందరో పదో తరగతి విద్యార్థులకు సాధ్యం కాని ఘనమైన మార్కులను డిస్టింక్షన్ ను కూడా సాధించి.. ఖంగుతినిపించారు.

వివరాల్లోకి వెళ్తే ఈ బుడతడి పేరు అగస్త్య జైస్వాల్. హైదరాబాద్ లోని కాచిగూడ ప్రాంతానికి చెందిన అశ్వనీ కుమార్, భాగ్యలక్ష్మీల కుమారుడు. అయితే ఆటపాటలతో పాటు చదువులో బాగా రాణించేవాడు. అంతేకాదు తన పుస్తకాలోని సందేహాలను నివృత్తి చేసుకుంటూనే తన కన్నా ఉన్నత పాఠ్య పుస్తకాలలోని సందేహాలను కూడా అడిగి వాటిని నివృత్తి చేసుకుంటూ.. కొన్ని రోజుల తరువాత వాటిని తిరిగి చెబుతుంటాడు. దీంతో తమ పిల్లాడిలోని తెలివి తేటలను గమనించిన తల్లిదండ్రులు అతడికి పదో తరగతి పరీక్షలను రాయించగా, అతను విజయవంతంగా పాస్ అయ్యారు. అయితే తొమ్మిదేళ్ల బుడతడి ప్రతిభను గమనించిన తెలంగాణ ప్రభుత్వం ఈ తరహా చిన్నారులను ప్రోత్సహించేందుకు గాను వయస్సును సడలిస్తూ ప్రత్యేక అనుమతిని మంజూరు  చేయడంతో అగస్త్య తన సత్తాను చాటుకున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SSC Board exams  Telangana  Education  

Other Articles