beer | alchohol | retail | sale

All india bruvers association demand to allow to sell beers in retail shops

beer, alchohol, retail, sale, all india bruvers association

all india bruvers association demand to allow to sell beers in retail shops. The assosiation said that the beer content only 5 to 8 eprcent of alchohol so it is demanding for allow.

ఇక కిరాణ దుకాణాల్లోనూ బీరు..!

Posted: 05/19/2015 07:50 AM IST
All india bruvers association demand to allow to sell beers in retail shops

మందు బాబులకు నిజంగా మంచి వార్తే. అందులోనూ బీరు ప్రియులకు శుభవార్తే. అసలే ఎండలు మండిపోతున్నాయి.. చల్లగా బీర్ కొడితే ఆ కిక్కే వేరప్పా అనుకునే వారికి మరింత చేరువకు బీర్లు. తాజాగా ఓ ప్రతిపాదన బీర్లను తాగుబోతుల చెంతకు చేర్చుతోందా అన్న అనుమానాలు కలిగిస్తోంది. సబ్బులు, ఉప్పులు, పప్పులు, షాంపూలు, పౌడర్లు  లాగా  అంతటా దీని అమ్మకాలు సాగించడానికి.. కిరాణా షాపుల ద్వారా వీటి అమ్మకాలకు అనుమతినివ్వాలని అఖిల భారత బ్రూవర్స్ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను కోరింది. ఆల్కాహాల్ పరిమితి తక్కువగా ఉన్న పానియంగా, లేదా ఇతర మద్యం ఉత్పత్తుల నుంచి తొలగించి బీర్‌ను ప్రత్యేక కేటగిరీలో ఉంచాలని కూడా  ఆ సంఘం డిమాండ్ చేసింది.  

ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను బీర్ నిల్వలను పెంచాలని మేము కోరాం. బీర్ ఒక సరదా, సామాజిక పానీయం. కాబట్టి వీటిని ఇతర ఎఫ్‌ఎమ్‌సిజి ఉత్పత్తుల మాదిరిగానే ఆధునిక రిటైల్ షాపుల ద్వారా అమ్మించాలి. అందుకు అనుమతినివ్వాలి అని ఎఐబిఎ చైర్మన్, సబ్‌మిల్లర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శలభ్ సేత్ పిటిఐతో అన్నారు. కాగా, కేరళ, మహారాష్టల్ల్రో బీర్ షాపులకున్న నిబంధనలను సడలించారని, ఈ దిశగా అన్ని రాష్ట్రాల్లో చర్యలుండేలా తమ ప్రతినిధులు పర్యటించనున్నారని ఎఐబిఎ ప్రధాన కార్యదర్శి శోభన్ రాయ్ తెలియజేశారు. అధిక ఆల్కాహాల్ (దాదాపు 42 శాతం) ఉన్న మద్యం సంబంధిత ఉత్పత్తిగానే బీర్‌ను పరిగణించడం సరికాదని అన్నారు. బీర్‌లో కేవలం 5-8 శాతం ఆల్కాహాల్ పరిమాణం మాత్రమే ఉంటుందని చెప్పారు. మొత్తానికి ఈ సంఘం డిమాండ్ నెరవేరితే కిరాణా షాపులూ మినీ బార్లుగా తయారవుతాయేమో.!

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beer  alchohol  retail  sale  all india bruvers association  

Other Articles