modi | lady singham | bhopal

How pm narendra modi s call created problems for lady singham officer

modi, lady singham, bhopal, phone, police

Prime Minister gave this lady officer Diwali gift in March when he called her up to appreciate her good work. Namita Sahu, a sub-inspector of police and in-charge of Birbhaya Patrolling Team in Bhopal was patroling near Shahpura Lake on that day. "I was shocked when the person on the other side told me that PM would talk to me. I never expected that the PM would call me," she had said while talking to the media.

లేడి సింగం లాంటి ఆఫీసర్ కు కష్టాలు తెచ్చిన మోదీ

Posted: 05/18/2015 03:21 PM IST
How pm narendra modi s call created problems for lady singham officer

టైటిల్ చదవగానే ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటున్నారేమో అస్సలు కాదు. అక్షరాల నూటికి నూరు శాతం వాస్తవం. ప్రధాని నరేంద్ర మోదీ వల్లల ఓ లేడీ ఆఫీసర్ ఇబ్బందుల పాలవుతోంది. పాపం అమ్మడు పరిస్థితి డిఫరెంట్ గా మారింది. అప్పటి దాకా సాఫీగా సాగిన జీవితం మోదీ చేసిన ఓఫోన్ కాల్ ఇబ్బందులు పెడుతోందట. ఇంతకీ విషయం ఏంటంటే అనగనగా ఓ లేడీ పోలీస్ ఆఫీసర్. ఎంతో నిజాయితీ గత వ్యక్తి ఆమె పేరు నమితా సాహు. సినిమాల్లో చూపించినట్లు ఒంటరిగా రౌడీలు, గుండాల తుగ్గురేక్కొడుతూ లోకల్ రౌడీలకు, గుండాలకు నిద్ర లేకుండా చేసేది. ఈ లేడీ ఆఫీసర్ ను అక్కడి వారు లేడీ సింగం అని కూడా పిలుస్తుంటారు. అయితే తర్వాత తర్వాత పరిస్థితి మారిపోయింది. ఒక్క ఫోన్ కాల్ ఆమె జీవితాన్ని మార్చింది. ఇంతకీ నరేంద్ర మోదీకి, నమిత కు ఏంటీ సంబందం అన్న విషయాలు తెలుసుకోవాలంటే స్టోరీ చదవాల్సిందే.

భోపాల్ లో సబ్ ఇన్పెక్టర్ గా పని చేస్తోంది నమితా సాహు. లోకల్ గా లేడీ సింగం అని పేరున్న నమిత రౌడీలకు సింహ స్వప్నంలా మారింది. అయితే ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత.. మరి మోదీకి ఈ లేడీ సింగం గురించి ఎలా తెలిసిందో కానీ ఆమెతో ఓ సారి ఫోన్ లో మాట్లాడాలని అనుకున్నారు. అంతే ప్రధాని ఆఫీస్ నుండి ఆమెకు, మీడియాకు సమాచారం అందింది. దాంతో ఆ ఆపీసర్ గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. మోదీ తో మాట్లాడటం గురించి పక్కన బెట్టి మీడియా పుణ్యమా అని అమ్మడుకు పాపులారిటీ బాగా వచ్చింది. దాంతో ఎక్కడికి వెళ్లినా ఒకటే గోళ.. ఆటోగ్రాఫ్ లు, , ఫోటోలు అంటూ అందరూ హడావిడి చేస్తున్నారట. అంతేకాకుండా తనపై ఆపీసర్లు కూడా తన మీద జలస్ ఉన్నారని, దాంతో తన డ్యుటీ సరిగ్గా చెయ్యాలేకపోతున్నానని తెగ బాధపడుతోంది నమిత. పాపం సదుద్దేశంతో మోదీ ఫోన్ చేసినా ఆ లేడి సింగానికి మాత్రం కష్టాలు వచ్చిపడ్డాయ్. మంచి చెయ్యబోతే చెడు ఎదురైనట్లు ఉంది నమిత, మోదీల వ్యవహారం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  lady singham  bhopal  phone  police  

Other Articles