Afghanistan | hands | India | doctors

Afghanistan citizen got hands by transpalntation in india

Afghanistan, hands, India, doctors, transplantation

Afghanistan citizen got hands by transpalntation in india. Abdul rahim who lost his hands in afghanistan, got hands by indian doctors effort.

ఆప్ఘన్ పౌరుడికి ఇండియన్ చేతులు

Posted: 05/18/2015 03:26 PM IST
Afghanistan citizen got hands by transpalntation in india

ఇప్పటి దాకా గుండె మార్పిడి, కాలేయ మార్పిడి , కిడ్నీ మార్పిడిల గురించి విని ఉంటారు కానీ ఇప్పుడు ఏకంగా చేతులు కూడా మారుస్తున్నారు. అయితే అది ఖచ్చితంగా అమెరికా లాంటి దేశంలోనే అని అనుకుంటున్నారేమో కానీ తప్పు.. అది మన ఇండియాలో మార్చారు. తాజాగా ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన ఓ ఆఫ్ఘన్‌ ఆర్మీ అధికారికి ట్రాన్స్‌ ప్లాంట్‌ చేశారు. ఆ చేతులను దానం చేసింది ఓ భారత వ్యక్తి కావటం గమనించాల్సిన అంశం.. తాలిబన్లు విధ్వంసం సృష్టించటానికి ఇసుకలో బాంబులను అమరుస్తుంటారు. సంకీర్ణ దళాలతో పాటు ఆఫ్ఘన్‌ దళాలపై తెగబడేలా ఆ బాంబుల్ని పెడతారు. అయితే అలా పూడ్చిన బాంబులను తొలగించటంలో కందహార్‌కు చెందిన అబ్దుల్‌ రహీమ్‌ ఆరితేరాడు. అంతేకాదు ఆఫ్ఘన్‌లో మిలటరీ కెప్టెన్‌గా పనిచేసేవాడు. తన విధుల్లో భాగంగా రహీం పూడ్చిన బాంబుల్ని తీస్తుండగా అవి అమాంతంగా పేలాయి. ఈ ఘటనలో అతను రెండు చేతులు కోల్పోయ్యాడు.

తన చేతులకు ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ చేయించుకోవాలని రహీం సంకల్పించాడు. చాలా దేశాలు తిరిగాడు. ఆ దేశాల్లో సాధ్యం కాదని చెప్పటంతో.. చివరకు అతను కేరళలోని అమృత ఇన్సిట్యూట్‌ ఆప్‌ మెడికల్‌ను సంప్రదించాడు. రహీం చేతులను ట్రాన్స్‌ప్లాంట్‌ చేయటానికి ఆస్పత్రి వర్గాలు అంగీకరించాయి. దాదాపు 30 మంది వైద్యులు సుమారు 15 గంటలపాటు శ్రమించి అతని రెండు చేతులను అతికించారు. బ్రెయిన్‌ డెడ్ర్‌ అయిన ఓ 54 ఏళ్ల కేరళ వ్యక్తి నుంచి సేకరించిన చేతులను రహీంకు ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేశారు. ఇన్నాళ్లు తనకు చేతులు లేవనే బాధ ఇకముందు ఉండదని ధీమాగా చెప్పుకుంటున్నాడు. తనకు కొత్త జీవితం ప్రసాదించిన వైద్య బృందాలను రహీం ప్రశంసల్లో ముంచెత్తుతున్నాడు.

*అబినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Afghanistan  hands  India  doctors  transplantation  

Other Articles