Six men gangrape 26-year-old woman in south Delhi; police arrest 4

Woman from south delhi s defence colony abducted raped

Delhi, gang rape, Kidnap, Rape, south delhi gangrape, rape, woman gangraped in Delhi, crime against women, Khanpur gangrape, violenece against women, harrasment against women, delhi woman raped

A 26-year-old woman was gang-raped by six men at a house after being kidnapped from the Defence Colony area of south Delhi on Sunday night, police said.

ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. యువతిపై గ్యాంగ్ రేప్

Posted: 05/18/2015 03:12 PM IST
Woman from south delhi s defence colony abducted raped

దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. అనేక నిర్భయ ఘటనలు దేశ రాజధానిలో నమోదవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడం లేదు. ఒబామా రాక కోసం వందల కోట్ల రూపాయలను వెచ్చించి.. అమర్చిన సిసి కెమారాలు.. ఢిల్లీలో అమర్చకపోవడంతో.. మరొందరో అమాయక మగువలు తమ మాన, ప్రాణాలను కొల్పోవాల్సి వస్తుంది. ప్రతిపక్షంలో వున్నప్పుడు అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టిన ప్రసత్తం అధికార పార్టీలు.. ప్రస్తుతం పేట్రేగిపోతున్న పైశాచిక మగమృగాళ్లపై కనీస చర్యలు తీసుకుని..ముందస్తుగానే వారిని అదుపులోకి తీసుకున్న ఘటనలు లేవు. కేసు విచారణలు త్వరితగతిన చేపట్టినంద మాత్రాన బాధితురాలికి ఏం ప్రయోజనం లభిస్తుందన్న విషయాన్ని అలోచించని ప్రభుత్వాలు.. నేరాలు జరగకుండా తెలంగాణ ప్రభుత్వం తరహాలో చర్యలు చేపట్టంలో ఎందుకు విఫలమవుతున్నాయి.

గత రాత్రి ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్..  నిర్భయ ఘటన కన్నా అత్యంత పాశవికంగా జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ యువతిని ఐదుగురు దుండగులు తమ కారులోకి లాక్కొని లైంగిక దాడికి పాల్పడ్డారు. పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ నగర్ నుంచి దక్షిణ ఢిల్లీలో ఉన్న డిఫెన్స్ కాలనీకి ఆటోల బయల్దేరిన యువతిని.. నలుగురు యువకులు శాంట్రో కారులో వచ్చి.. వెళ్తున్న ఆటోలో నుంచి ఆమెను తమ కారులోకి లాక్కొన్నారు. దుండగులు ఆమెను దక్షిణ ఢిల్లీలోని దక్షిణ్పురికి తీసుకెళ్లారు. అక్కడ మరో వ్యక్తి వారితో జతకలిశాడు. ఐదుగురు కలసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను డిఫెన్స్ కాలనీలో విడిచి వెళ్లిపోయారు. బాధితురాలు, ఆటో్ డ్రైవర్  వాంగూల్మం మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వారు ప్రయాణించిన కారును స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Woman  Pulled From Auto  Gang Rape  delhi  

Other Articles