7 killed, 27 injured in Nigeria's bus station bomb blast

Seven killed in nigeria blast triggered by 10 year old girl

Seven killed in Nigeria blast, blast triggered by 10-year-old girl, Nigeria blast, Seven killed, 10-year-old girl, hospital, Damaturu, attack, blast, medical, Bomb, blast, Yobe, state, Nigeria;, 9, dead, Belgium, Cameroon, Chad, Niger, Nigeria

At least seven people were killed and 27 others injured in a bomb blast in Nigeria’s northern state of Yobe.

నైజీరియాలో పదేళ్ల చిన్నారి ఆత్మాహుతి దాడి, 9మంది మృతి

Posted: 05/17/2015 02:32 PM IST
Seven killed in nigeria blast triggered by 10 year old girl

నైజీరియాలో దారుణం జరిగింది. నైజీరియాలోని ఉత్తర ప్రాంతంలో గల యోమ్ రాష్ట్ర రాజధాని మతతురులో 10 ఏళ్ల వయస్సున్న చిన్నారి జరిపిన ఆత్మాహుతి దాడిలో తొమ్మిది మంది మరణించారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. దమతురులో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని... వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయి.

అయితే ఈ ఆత్మాహుతి దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. క్షతగాత్రులకు వైద్య ఖర్చులను భరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ దాడి జరిగిన ప్రాంతంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. జన సమర్థం అధికంగా ఉండే బస్టాండ్ లోకి ప్రవేశించిన చిన్నారి తనను తాను పేల్చుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nigeria blast  Seven killed  10-year-old girl  

Other Articles