Striking a chord: Narendra Modi turns musician in Mongolia

India to provide a line of credit of 1 billion to mongolia says narendra modi

Narendra Modi, Mongolia, World, Morin Khuur,Mongolia, Double Taxation Avoidance Convention, credit of $1 billion to Mongolia, economic capacity and infrastructure, upgrade relationship from Comprehensive to "Strategic Partnership, Saikhanbileg State Palace.

Prime Minister Narendra Modi seems to have a penchant for musical instruments. He did not shy away from playing the traditional ‘morin khuur’ during his visit to Mongolia.

మంగోలియాతో భారత్ కలసి పనిచేస్తుంది: ప్రధాని మోడీ

Posted: 05/17/2015 01:23 PM IST
India to provide a line of credit of 1 billion to mongolia says narendra modi

ఆసియా ఖండంలో శాంతి, స్థిరత్వం, అభివృద్ధి కోసం మంగోలియాతో కలిసి పనిచేస్తానని భారత ప్రధాని నరేంద్రమోడీ ఉద్ఘాటించారు. మానవ సంబంధాలతోనే ఆర్థిక బంధాలు బలంగా మారుతాయన్నారు. మంగోలియా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ ఆదేశ పార్లమెంట్‌ ఈ మేరకు ప్రసంగించారు. మంగోలియాలో పర్యటించడం చాలా సంతోషంగా ఉందని, అదులోనూ భారత ప్రధానుల్లో ఈ దేశంలో లో పర్యటించిన తొలి ప్రధాని తాను కావడం గర్వంగానే వుందన్నారు. మంగోలియాతో సంబంధాలు మరింత బలోపేతమయ్యాయన్నారు.

ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కోసం ఐదు దశాబ్దాల కిత్రం మంగోలియాకు భారత్ మద్దతు పలికిన విషయాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారత యాక్ట్ ఈస్ట్ విధానంలో మంగోలియా అంతర్భాగమని వెల్లడించారు. భారత్ మంగోలియా దేశాల ఆర్థిక భాగస్వామ్యాన్ని కొత్త పుంతలు తొక్కిద్దామని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా భారత వాణిజ్యాల నేపథ్యంలో మంగోళియాకు బిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యబాంధవ్యాలు మరింత బలపడతాయని చెప్పారు. మంగోళఇయా ఆర్థిక స్థోమత, ఇన్ ఫ్ఱాస్టక్చర్ వృద్దికి ఇది దోహదపడుతుందని ఆయన అన్నారు.

అంతకు ముందు ప్రధాని నరేంద్రమోడీ మంగోలియాలో ఫిడేలును వాయించారు. తనలోని సంగీత విద్యాంసుడిని నిద్రలేపిన మోడీ.. తన మూడు దేశాల పర్యటనలో భాగంగా మంగోలియా సంప్రదాయ వాయిద్యంగా పేరొందిన మొరిన్ ఖుర్ ను చూడడగానే దానిని చేతిలోకి తీసుకుని సున్నితంగా వాయించారు. అచ్చంగా ఫిడేలు తరహాలో వుంటే ఈ వాయిధ్యం వాయించి అక్కడి ప్రధానితో తన ఆనందాన్ని పంచుకున్నారు మోడీ

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  Mongolia  Double Taxation Avoidance Convention  

Other Articles