yamadharma | traffic | rules | jharkhand

Yamadhrma on roads and explain the traffic rules in jharkhand

yamadharma, traffic, rules, jharkhand

In Jharkhand's capital Ranchi, unruly drivers have been encountering Yamraj, the god of death. It is not just a vision. "Yamraj" is a traffic policeman in costume, complete with a fake moustache, a mace and a whip. And ready to serve challans or traffic violation tickets.

ITEMVIDEOS: యమధర్మరాజే వచ్చి ట్రాఫిక్ రూల్స్ చెబితే

Posted: 05/15/2015 04:50 PM IST
Yamadhrma on roads and explain the traffic rules in jharkhand

యాక్సిడెంట్స్ లొ చాలా మంది చనిపోతున్నారు. వేగంగా వెమికిల్స్ ను నడపడం, ట్రాఫిక్ రూల్స్ పాటింకపోవడం లాంటి తప్పుల వల్ల వెహికిల్స్ నడిపే వారు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయితే ట్రాఫిక్ రూల్స్ పాటించండి బాబూ అంటే ఎంత మంది ఎన్ని రకాలుగా చెప్పినా చాలా మంది వినడంలేదు.. అసలు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. అయితే ఒకవేళ యమధర్మరాజే వచ్చి ట్రాఫిక్ రూల్స్ పాటించండి బాబూ అంటే ఎలా ఉంటుంది. అవును బాబూ.. మీరు గనక ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే నా దగ్గరికి వస్తారు కాబట్టి ట్రాఫిక్ రూల్స్ పాటించంటి సేఫ్ గా వెళ్లండి అంటూ యమధర్మరాజు రోడ్ల మీద ప్రచారం చేస్తున్నాడు. ఇంతకీ ఎక్కడ జరిగింది అన్న అనుమానాలకు కింది ర్యారా సమాధానం.

వాహనదారులకు ఎన్ని రకాలుగా చెప్పినా నిబంధనలు అతిక్రమించే వారు వాటిని ఇంకా అతిక్రమిస్తూనే ఉన్నారు. అలాంటి వారి కోసమే జార్ఖండ్‌ రాజధాని రాంచిలో అక్కడి ట్రాఫిక్‌ పోలీసులు వినూత్న రీతిలో అవగాహనా కార్యాక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓ కానిస్టేబుల్‌ చేత యముడి వేషాధారణ వేయించి ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించే యత్నం చేశారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుంటే చావు తప్పదంటూ హెచ్చరించారు. వాటివల్ల కలిగే అనర్థాలను ప్రతి ఒక్కరికీ వివరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు వేశారు. అయితే గతంలోనూ రాంచీ పోలీసులు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశారు. వాహన దారులకు పుష్పాలు అందించారు. అయినా వారిలో మార్పు రాకపోవడంతో యమధర్మరాజు చెబితేనైనా వింటారనే ఆలోచనలో ఇలా చేశామని అక్కడి ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు చెప్పారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yamadharma  traffic  rules  jharkhand  

Other Articles