professor | america | nude

A professor called to come nude to write exam

professor, america, california, nude, teacher, students

A professor called to come nude to write exam. Shandiyago university of california in america, a professor called to students to come nude and write exam.

బట్టలు లేకుండా రండి.. పరీక్ష రాయండి

Posted: 05/15/2015 04:17 PM IST
A professor called to come nude to write exam

బట్టలు లేకుండా కాలేజీ రమ్మన్నాడో ప్రొఫెసర్.. ఎందుకంటే తన సబ్జెక్ట్ పరీక్ష రాయాలంటే బట్టలు లేకుండా రావాలని ఆదేశించాడు. అమెరికాలోని కాలిఫోర్నియా శాండియాగో యూనివర్సిటీలో ఓ ప్రొఫెసర్ చేసిన కామెంట్ కలకలం రేపుతోంది. విజువల్ ఆర్ట్స్ విభాగంలో ప్రొఫెసర్ అయిన ఆయన.. చివరి పరీక్షకు నగ్నంగా రమ్మని విద్యార్థులను ఆదేశించడం వివాదాస్పదమైంది. యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్న రికార్డో డొమింగ్వెజ్ తన సబ్జెక్టులో గట్టెక్కాలంటే పరీక్షకు నగ్నంగా రావాలని విద్యార్థులకు హుకుం జారీ చేశాడు. అంతే కాదు తానూ నగ్నంగా వస్తానని చెప్పాడు. ఇదంతా ఎందుకయా అంటే.. ఒంటిపై నూలుపోగు లేకుండా వస్తే.. అరమరికలు లేకుండా అందరం అసలైన వ్యక్తిత్వాలను ఆవిష్కరించుకుందామని ఆయనగారు సెలవిచ్చారట.

ప్రొఫెసర్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఆ ప్రొఫెసర్ కు ఏమైనా మెంటలా అని మండిపడ్డారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని, యూనివర్సిటీకే సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలను అసలు వర్సీటీకే పంపమని తెగేసి చెప్పారు. ఎవరి కామెంట్స్ ఎలా ఉన్నా.. ప్రొఫెసర్ మాత్రం తన వాదనను సమర్థించుకుంటున్నాడు. 11 ఏళ్లుగా ఈ నగ్న తరగతి నిర్వహిస్తున్నానని.. ఇప్పటివరకు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని చెబుతున్నాడు. ఇది బాడీ ఆర్ట్ కు సంబంధించిన విషయమని, ఓ డార్క్ రూంలో కొవ్వొత్తుల వెలుగులో నిర్వహిస్తామని, పూర్తి నియంత్రణతో ఉంటుందని వివరిస్తున్నాడు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : professor  america  california  nude  teacher  students  

Other Articles