Jayalalithaa set to assume office of CM next week, convenes MLAs meeting on May 22

Jayalalithaa calls meeting of aiadmk mlas on may 22

Jayalalithaa calls meeting of AIADMK MLAs on May 22, Jayalalithaa, Jayalalithaa assuming office, Tamil Nadu chief minister, Jayalalithaa meeting, ,India ,Tamil Nadu

AIADMK chief Jayalalithaa is all set to return as Tamil Nadu Chief Minister soon for the fifth time following her acquittal in the disproportionate assets case and has convened a meeting of her party MLAs on May 22.

ఐదవసారికి.. ముహూర్తం కుదిరింది. ఎమ్మెల్యేలకు పిలుపు అందింది..

Posted: 05/15/2015 03:56 PM IST
Jayalalithaa calls meeting of aiadmk mlas on may 22

శుభముహూర్తానికి సమయం ఆసన్నమైంది. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో అపీలుపై కొంత నైరాశ్యం మదిలో వున్నా.. ప్రత్యర్థులకు దడిచి పదవిని చేపట్టలేదన్న ప్రతిపక్షాల విమర్శలను బలంగా ఎదుర్కోనేందుకే.. పడిలేచిన కెరటం మాదిగా అమె ముందుకు సాగాలని నిర్ణయం తీసుకుంది. ఏఐడీఎంకే ఎమ్మెల్యేలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న తరణం రానే వచ్చింది. అక్రమాస్థుల కేసుతో ముఖ్యమంత్రి పదవికితో పాటు పార్టీ పదవులకు దూరమైన అధినేత్రి ఐదవ సారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి రంగం సిద్దమైంది. ఎవరి గురించి చెబుతున్నామో అర్థమైంది కదూ..!

ఇందుకోసం ఈనెల 22న ఉదయం ఏడు గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయంతో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలందరూ హాజరుకావాలని పార్టీ అధినేత్రి జయలలిత శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఆమె కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. అయితే సమావేశం ప్రధాన అజెండా ఏమిటనేదానిపై ప్రకటనలో ప్రస్తావించలేదు. దీంతో జయలలితను తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ నెల 23న శుభముహూర్తం వున్నందున, 22న పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించిన పిదప అమె మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కర్ణాటక హైకోర్టు తీర్పుతో ఆదాయానికి మించిన ఆస్తుల కేసునుంచి నిర్దోషిగా బయటపడటంతో సీఎం పీఠాన్ని అధిరోహించేందుకు జయకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయాయి. అయితే హైకోర్టు తీర్పుపై కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలు చేయనున్నట్లు వార్తలు రావడం, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య కూడా ఆ వార్తలను నిర్ధారించడంతో సీఎం పదవి చేపట్టేవిషయంలో జయలలిత పునరాలోచనలో పడ్డట్లు తెలిసింది. వచ్చే శుక్రవారం (22న) జరిగే సమావేశం తరువాత జయ పదవీస్వీకారానికి సంబంధించిన అన్ని విషయాలపై స్పష్టతవచ్చే అవకాశం ఉంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalitha  meeting with MLAs  AIADMK MLAs  

Other Articles